మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.తామంతా హరీశ్ రావు వెంట ఉంటామని చెప్పారు.
పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్ రావు ఉన్నారన్న కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ మూలస్తంభంగా హరీశ్ రావు కొనసాగుతారని స్పష్టం చేశారు.అయితే మంత్రి హరీశ్ రావు రాజకీయంగా చాలా మందిని అణిచివేశారని ఎమ్మెల్యే మైనంపల్లి ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే హరీశ్ రావును అణిచివేసేది తానేనంటూ హన్మంత రావు విరుచుకుపడ్డారు.తాను, తన కుమారుడు ఎక్కడ నుంచి పోటీ చెయ్యాలో చెప్పడానికి హరీశ్ రావు ఎవరంటూ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.