సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం’‘ ( Guntur Kaaram ) .మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగి పోయాయి.
ఎందుకంటే ఇప్పటికే ఈ కాంబో రెండుసార్లు రాగా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు ముచ్చటగా మూడవసారి రాబోతుంది.
అతడు,( Athadu ) ఖలేజా వంటి రెండు డిఫరెంట్ సినిమాలను చేసిన ఈ కాంబో ఇప్పుడు మూడవ సినిమాగా మరింత మాస్ మసాలా సినిమాను సిద్ధం చేస్తున్నారు.దీంతో ఈ సినిమాపై ఆడియెన్స్ లో మరిన్ని అంచనాలు పెరిగాయి.ప్రజెంట్ చాలా వేగంగా షూట్ జరుగుతుండగా ఈ సినిమా నుండి ఇప్పుడొక వార్త వైరల్ అవుతుంది.వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఇప్పట్లో ఈ సినిమా అప్డేట్ ఉండే అవకాశం లేదు అని తెలుస్తుంది.
ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగా భారీ హైప్ ఏర్పడింది.ఇక ఈ అప్డేట్ తర్వాత మరో అప్డేట్ అనేది రాలేదు.
.ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
ఎప్పటి నుండో ఈ సాంగ్ వస్తుంది అని ఊహాగానాలు వస్తున్నాయి.కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సాంగ్ దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు అని టాక్…
నిజానికి వినాయక చవితికే ఈ సాంగ్ రిలీజ్ కావాల్సి ఉండగా ఈ అప్డేట్ ను దసరాకు మార్చారు అని తెలుస్తుంది.దీంతో దసరా వరకు ఎలాంటి అప్డేట్ ఉండదేమో చూడాలి.కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.