సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన సావిత్రి( Savitri ) గారి గురించి మనందరికీ తెలుసు…ఆమె జీవితకథ ఆధారంగా మహానటి( Mahanati ) అనే సినిమా కూడా తీయడం జరిగింది.ఆమె ఎంత మంచి నటి అయిన కూడా ఆమె చివరి రోజుల్లో తినడానికి కూడా ఇబ్బంది పడి చాలా నరకం అనుభవించారట అయితే ఆమె చివరి స్టేజ్ లో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది.ఇంకా అలాంటి సమయంలో ఒకరోజు ఒక సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె షూటింగ్ లో పాల్గొని షూట్ బ్రేక్ సమయంలో ఆమె ఏమి తినకుండా ఒక మూలన కూర్చుని ఉందట ఇక అదే సమయానికి గుమ్మడి గారు ( Gummadi ) ఆమెను చూసి ఏంటి సావిత్రి ఇక్కడ కూర్చుంది అని మనసులో అనుకున్నారంట
అప్పటికే గుమ్మడి గారికి ఇంటి దగ్గర నుంచి లంచ్ క్యారియర్ రావడం జరిగిందంట సావిత్రి గారి దగ్గరికి వెళ్లి ఎంటమ్మ లంచ్ చేయకుండా ఇక్కడ కూర్చున్నావు అని అనగానే సావిత్రి నాకు ఆకలిగా లేదన్న అని చెప్పింది అంట అయితే అప్పటికి సావిత్రి అన్ని కోల్పోయి ఒంటరిది అయిపోయింది.ఇక దాంతో ఇంటి దగ్గర నుంచి ఆమె కి క్యారియర్ తీసుకువచ్చే వాళ్ళు కూడా లేరు దాంతో ప్రొడక్షన్ వాళ్లు కూడా తనను సరిగా పట్టించుకోకుండా
తనకు లంచ్( Lunch ) కూడా అరేంజ్ చేయలేదు అని అర్థం చేసుకున్న గుమ్మడి గారు ఆమెతో మా ఇంటి నుంచి క్యారియర్ వచ్చింది వెళ్లి తిందాం పదమ్మ అని అంటే అప్పుడు సావిత్రి కన్నీళ్లు పెట్టుకుంది.దాంతో గుమ్మడి గారు ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్లి ఆయనే స్వయంగా ఆమె కి వడ్డించి పెట్టారట.ఒకప్పుడు సిటీలో ఉన్న టాప్ మోస్ట్ హోటల్లో నుంచి ఫుడ్డు తెప్పించుకొని తిన్న సావిత్రి కి కనీసం ఇప్పుడు అన్నం పెట్టే వాళ్ళు కూడా లేక దీనస్థితిలో ఉండడం చూసిన గుమ్మడి గారు కన్నీళ్లు ఆపుకోలేక ఆయన కూడా సావిత్రి గారితో పాటు ఏడ్చారంట…