గుజరాత్ సముద్ర తీర ప్రాంతం అంతా అల్లకల్లోలంగా మారింది.తీవ్ర తుపాను బిపర్ జోయ్ ఇవాళ సాయంత్రం తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది.
జఖౌ తీరానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో బిపర్ జోయ్ తుపాను ఉందని తెలుస్తోంది.గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది.
దీని ప్రభావంతో గుజరాత్ సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది.అక్కడ గంటకు 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమైయ్యారు.ఈ క్రమంలోనే కచ్ తో పాటు సౌరాష్ట్రలో 15 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.
ఇప్పటికే 74 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.అయితే బిపర్ జోయ్ కారణంగా అంచనాలకు మించి నష్టం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.