2024 సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయిన కూడా వాటి మధ్య పోటీ అనేది ఉంటుంది కానీ టాలీవుడ్లో మాత్రం మోస్ట్‌ ప్రెస్టీజియస్‌ సీజన్‌ ఏదైనా ఉందా అంటే అది సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి ఎందుకంటే ఆ సీజన్‌ కోసం చాలా మంది అగ్ర హీరోలు, ఒక్కోసారి చిన్న హీరోలు కూడా పోటీ పడుతుంటారు.ఈ ఇయర్ సంక్రాంతి ఏకంగా బాలయ్య చిరంజీవి లు పోటీ పడ్డారు…ఈ పోటీ లో ఇద్దరు మంచి సక్సెస్ ను అందుకున్నారు అయితే మన హీరోలు అందరు కూడా వాళ్ళు చేసే సినిమాను ఆ టైమ్‌కల్లా సిద్ధం చేసి, విడుదల చేయాలని అనుకుంటూ ఉంటారు.

 2024 Sankranti Star Hero Movies Details ... Pavan Kalyan , Guntur Kaaram , Mahe-TeluguStop.com

అయితే గత కొన్నేళ్లుగా ఈ సీజన్‌కు అనుకున్నది అనుకున్నట్లు జరగడం లేదు.దీంతో ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలని సంక్రాంతి సీజన్‌కి రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఈ ఏడాది లాగే వచ్చే ఏడాది కూడా క్లారిటీ లేకుండా ఉంది…

 2024 Sankranti Star Hero Movies Details ... Pavan Kalyan , Guntur Kaaram , Mahe-TeluguStop.com
Telugu Bollywood, Eagle, Guntur Kaaram, Mahesh Babu, Pavan Kalyan, Prabhas, Proj

రవితేజ కొత్త సినిమా ‘ఈగల్‌( Eagle )’ రిలీజ్‌ డేట్‌ను టీమ్‌ అనౌన్స్‌ చేసింది.డేట్‌ క్లియర్‌గా చెప్పలేదు కానీ.2024 సంక్రాంతి అని అయితే చెప్పింది.దీంతో మాస్‌ మహరాజ్‌ ఫ్యాన్స్‌కి కిక్‌ ఇస్తే.

మిగిలిన వారికి కన్‌ఫ్యూజన్‌ వచ్చింది.అదేంటి అనుకుంటున్నారా? ఇప్పటికే సంక్రాంతికి సినిమాలు ఫుల్‌ ప్యాక్‌ అయి ఉంటే.ఈ సినిమా ఎందుకు బరిలోకి దిగినట్లు అని అంటున్నారు.దీంతో ఏ సినిమా వాయిదా పడుతుంది అంటూ చర్చలు మొదలుపెట్టారు.కొందరైతే ఏటా ఇదేం పంచాయితీ.ఒక పద్ధతిగా డేట్స్‌ అనుకోవచ్చు కదా అని కూడా అంటున్నారు…

Telugu Bollywood, Eagle, Guntur Kaaram, Mahesh Babu, Pavan Kalyan, Prabhas, Proj

టాలీవుడ్ లో బెర్తులు బుక్ అనే కాన్సెప్ట్‌ చాలా రోజుల నుండి ఉంది.అలా వచ్చే పెద్ద పండగక్కి ఏ సినిమాలు వస్తాయో ఓ ఐడియా అయితే ఉంది.మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ ‘గుంటూరు కారం’( Guntur Kaaram ) సంక్రాంతికే అంటున్నారు.

ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ ‘ప్రాజెక్ట్‌ కె( Project K )’ కూడా అప్పుడే అన్నారు.దిల్‌ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి సంక్రాంతికి ఓ సినిమా పక్కా.

సెట్స్‌ మీదున్న పవన్‌ కల్యాణ్‌ 3 సినిమాల్లో ఒకటి ఉంటుంది అని కూడా లెక్కలేశారు.ఇలాంటి సమయంలో రవితేజ బరిలోకి రావడంతో ఏ సినిమాలు వెనక్కి వెలుతాయి అనే చర్చ మొదలైంది.

ఏదో సినిమా సంక్రాంతికి రాదనే ఉద్దేశంతోనే రవితేజ ‘ఈగల్‌’గా వస్తున్నాడు అని అంటున్నారు.దీంతో ఈ క్లారిటీ లేకుండా సంక్రాంతి సినిమాల మధ్య పోటీ వచ్చే ఏడాది కూడా ఉంటుందా అనే అసహనం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube