జిరాఫీలు వీటిని కూడా తింటాయా..? వైరల్‌గా మారిన వీడియో

ఇటీవల జంతువులకు( animals ) సంబంధించి కొన్ని వింత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.జంతువులు ఆహారంగా వేటిని పడితే వాటిని తీసుకుంటున్నాయి.

 Giraffes Also Eat These The Video Went Viral, Giraffe, Eats, Viral Latest, News-TeluguStop.com

శాకాహారం జంతువులు మాంసాహరం.మాంసాహరం( carnivorous ) తీసుకునే జంతువులు శాకాహరం తీసుకోవడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారుతూ ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో మరొకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో జిరాఫీలు( Giraffes ) ఎముకలను తినడం షాకింగ్‌గా మారింది.ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాత నంద( Susatha Nanda ) ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ వీడియోలో జిరాఫీలు బోన్స్ నములుతూ కనిపించాయి.సాధారణంగా జిరాఫీలు ఆకులు, మొక్కలను మాత్రమే తింటాయి.ఆకులు, చెట్లను మాత్రమే తింటూ ఉంటాయి.కానీ ఎముకలను తినడం( eating bones ) చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఇందులో వింత ఏమీ లేదని, ఫాస్పరస్ కోసం కొన్నిసార్లు ఎముకలను తింటూ ఉంటాయని అంటున్నారు.

జంగిల్ సుఫారీలో కొందరు పర్యాటకులు జిరాఫీలు ఎముకలను తింటున్న దృశ్యాలను చిత్రీకరించారు.ఈ వీడియోను షేర్ చేసిన సుశాంత నంద.ప్రకృతి అద్భుతం అంటూ క్యాప్షన్ పెట్టారు.ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.గతంలో జింక పామును తింటుున్న వీడియోను సుశాంత నంద షేర్ చేశారు.జింకలు శాకాహరులు అని చెబుతారు.

అవి మాంసాన్ని తినవు.కానీ పాముని తినడం సైన్స్‌కే సవాల్‌గా మారింది.

అది మరువకముందే ఇప్పుడు జిరాఫీలు ఎముకలను తింటున్న వీడియోె బయటకొచ్చింది, జంతువులకు సంబంధింన ఈ వీడియోలు సోషల్ మీడియలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.ఈ వీడియోలకు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

వీడియోలు బాగుంటున్నాయని కొందరు.ప్రకృతికి విరుద్దంగా జరుగుతున్నాయని మరికొందరు కామెంట్ చేస్తోన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube