తన వివాహ వేడుకకు హాజరయ్యేందుకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడు దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్ట్ తోసిపుచ్చింది.వివరాల్లోకి వెళితే.
ధనరాజ్ పటేల్ అనే వ్యక్తికి గత నెలలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో అనుమతి నిరాకరించారు అధికారులు.అతను ఢిల్లీ ద్వారా దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.
అయితే పటేల్‌ను డిసెంబర్ 27న అధికారులు దుబాయ్‌కి బహిష్కరించారు.పిల్లల లైంగిక వేధింపుల కేసులో అతను దోషిగా ఉన్నట్లు అమెరికా పాస్‌పోర్ట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ధనరాజ్ పటేల్ తన తండ్రి ద్వారా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు.జనవరి 7న తన వివాహం అధికారికంగా జరగనున్నందున ఆనంద్‌లోని తన స్వస్థలంలో వుండాలని అనుకుంటున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నాడు.
ఆనంద్‌లోని కరంసాద్‌లో జన్మించిన పటేల్.7వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాడు.అనంతరం 17 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లి ఆ దేశ పౌరసత్వం పొంది, ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నాడు.అయితే 2015లో యునైటెడ్ స్టేట్స్ కోడ్స్ 212 బీ (సీ)(1)లోని సెక్షన్ 22 ప్రకారం.
మైనర్‌పై లైంగిక అభియోగాలకు పాల్పడినట్లు పటేల్‌పై అమెరికా అధికారులు అభియోగాలు మోపారు.ఇదే సమయంలో.తనకు విచారణ ప్రక్రియ గురించి తెలియదన్న ధనరాజ్ పటేల్ నేరాన్ని అంగీకరించగా, ప్రస్తుతం అతను పరిశీలనలో వున్నాడు.అయితే అమెరికా పౌరసత్వం పొందిన తర్వాత ధనరాజ్‌కు భారతీయ పాస్‌పోర్ట్ రద్దు చేశారు.
అనంతరం అమెరికా పాస్‌పోర్ట్ మంజూరైంది.
ఇదే సమయంలో మైనర్‌పై లైంగిక దాడి నేపథ్యంలో అతని అమెరికా పాస్‌పోర్ట్‌ను కోర్టుకు సరెండర్ చేయగా.ఈ నేరాన్ని తెలుపుతూ మరో పాస్‌పోర్ట్‌ను ధనరాజ్‌కు మంజూరు చేశారు అక్కడి అధికారులు.గుజరాత్ హైకోర్టులో విచారణ సందర్భంగా కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ దేవాంగ్ వ్యాస్ వాదనలు వినిపించారు.
ధనరాజ్ పటేల్ భారతీయ పౌరుడు కాదని, అతను భారత్‌లో లేనందున పిటిషన్‌ను కొనసాగించరాదని కోర్ట్‌ను కోరారు.దుబాయ్‌లో వున్న వ్యక్తి భారత్‌లో తన జీవితానికి, స్వేచ్ఛకు ప్రమాదం కలిగిందని ఎలా చెబుతారని దేవాంగ్ వ్యాస్ వాదనలు వినిపించారు.
ఈ వాదనలతో ఏకీభవించిన కోర్ట్.ఫారినర్స్ యాక్ట్, 1946లోని సెక్షన్ 3 ప్రకారం.
వివిధ నేరాల్లో దోషులుగా తేలిన విదేశీయులకు దేశంలోకి అనుమతిని నిరాకరించే అధికారం భారత ప్రభుత్వానికి వుందని వ్యాఖ్యానించింది.ఇదే సమయంలో ధనరాజ్ పటేల్ పిటిషన్‌ను కొట్టివేసింది.