హైదరాబాద్ కూకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలింది.మూడంతస్తుల భవనంలో శ్లాబ్ కూలింది.
ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.మూడో అంతస్తులో శ్లాబ్ వేస్తుండగా భవనం కుప్పకూలినట్లు సమాచారం.
శిథిలాల కింద మరి కొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.