మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే తనని తాను నిరూపించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్.ఇక ఈ మధ్యనే అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి యావత్ ప్రపంచాన్ని మెప్పించాడు.
ఈ సినిమా తర్వాత ఈయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ప్రెజెంట్ అయితే చరణ్ లైనప్ ఇంట్రెస్టింట్ దర్శకులతో సాగుతుంది.
వరుసగా అగ్ర దర్శకులని లైన్లో పెడుతూ దూసుకు వెళ్తున్నాడు.ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ విదేశాల్లో జరిగే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడి ప్రేక్షకులను కూడా తన స్టైల్ తో మెప్పిస్తున్నాడు.
తాజాగా ఈయన కాలిఫోర్నియాలో జరిగే ఒక అవార్డు వేడుకకు హాజరయ్యాడు.

మరి విదేశాల్లో వేడుక అంటే అక్కడ వారికీ తగినట్టుగా మారాల్సిందే.రామ్ చరణ్ కూడా వారికీ తగ్గట్టు డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తూ ఆకట్టు కుంటున్నాడు.తాజాగా చరణ్ మరోసారి తన లుక్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు.
బ్లాక్ కలర్ ట్రెండీ సూట్ లో రామ్ చరణ్ చాలా కూల్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.ప్రెజెంట్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే.
దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.







