ఇంటర్ లో స్టేట్ ఫస్ట్.. గ్రూప్1 పరీక్షలో ఫస్ట్ ర్యాంక్.. నాన్న కల నెరవేర్చిన ప్రత్యూష సక్సెస్ స్టోరీ ఇదే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా గ్రూప్1 ఫలితాలు విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే.ఈ ఫలితాల్లో భానుశ్రీ లక్ష్మీ( Bhanushree Lakshmi ) అన్నపూర్ణ ప్రత్యూష ఫస్ట్ ర్యాంక్ సాధించారు.

 Group1 Topper Pratyusha Success Story Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

తొలి ప్రయత్నంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రత్యూష తన సక్సెస్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తనది పశ్చిమ గోదావరి జిల్లాలోని సీసలి గ్రామం అని నాన్న గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Appsc, Topper, Pratyusha, Pratyusha Story-Movie

చిన్నప్పటి నుంచి తాను మంచి స్టూడెంట్ అని ఇంటర్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ప్రత్యూష కామెంట్లు చేశారు.ఇంటర్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ లో బీఏ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ లో చేరానని ఆమె పేర్కొన్నారు.నాన్న నన్ను కలెక్టర్ హోదాలో చూడాలని కోరుకున్నారని సివిల్స్ లక్ష్యంగా పెట్టుకుని ప్రిలిమ్స్ సాధించానని ఆమె తెలిపారు.

Telugu Appsc, Topper, Pratyusha, Pratyusha Story-Movie

తాజాగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్( APPSC Notification ) పడటంతో నాన్న సూచన మేరకు ప్రశ్నించానని మంచి ర్యాంక్ వస్తుందని అనుకున్నాను కానీ ఏకంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదని ప్రత్యూష చెప్పుకొచ్చారు.పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఢిల్లీలో అమ్మ నాకు తోడుగా ఉండి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారని ప్రత్యూష( Pratyusha )కామెంట్లు చేశారు.నా వయస్సు 22 ఏళ్లు అని ప్రత్యూష తెలిపారు.

నన్ను నేను నమ్మడం వల్లే కెరీర్ పరంగా సక్సెస్ సాధించానని ఆమె తెలిపారు.తండ్రి కోరికను కొంతమేర నెరవేర్చానని ప్రత్యూష వెల్లడించారు.

ఎంచుకున్నది ఏదైనా శ్రమ పడుతూ కాకుండా మిమ్మల్ని మీరు నమ్మితే విజయం సాధించడం తథ్యమని ఆమె చెబుతున్నారు.ప్రత్యూష చెప్పిన విషయాలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.

ప్రత్యూషకు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube