చుండ్రు.ఎందరినో వేధించే కామన్ సమస్య ఇది.తలలో ఉండే చుండ్రు మొహం మీద, భుజాల మీద రాలి చాలా చిరాగ్గా కనిపిస్తుంది.అలాగే చుండ్రు కారణంగా దురద, హెయిర్ ఫాల్‌తో పాటుగా ముఖంపై మొటిమలు కూడా వస్తుంటాయి.
అందుకే చుండ్రును నివారించుకునేందుకు రకరకాల షాంపూలు వాడుతుంటారు.ఏవేవో హెయిర్ ప్యాకులు వాడుతుంటారు.
అయినప్పటికీ ఫలితం లేకుంటే.తీవ్రంగా కృంగిపోతుంటారు.
అయితే చుండ్రుకు చెక్ పెట్టడంలో పెసరపిండి అద్భుతంగా సహాయపడుతుంది.మరి పెసర పిండిని తలకు ఎలా ఉపయోగించాలి.? అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో నాలుగు స్పూన్ల పెసర పిండి, రెండు స్పూన్ల పెరుగు, రెండు స్పూన్ల నిమ్మ రసం వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.
అర గంట పాటు వదిలేయాలి.అనంతరం కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూ యూజ్ చేసి.
హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.
చుండ్రు క్రమంగా తగ్గుతుంది.
అలాగే ఒక గిన్నెలో నాలుగైదు పెసర పిండి, నాలుగు స్పూన్ల ఉసిరి కాయ రసం వేసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు మరియు జుట్టు మొత్తానికి పట్టించాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా నాలుగు రోజులకు ఒక సారి చేస్తే.చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక ఒక గిస్పెలో మూడు స్పూన్ల పెసర పిండి, మూడు స్పూన్ల వేపాకు రసం వేసుకుని బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు, కుదుళ్లకు అప్లై చేసుకుని.కాసేపు వదిలేయాలి.అనంతరం మామూలు షాంపూ యూజ్ చేసి.గోరు వెచ్చటి నీటితో హెడ్ బాత్ చేయాలి.ఇలా చేసినా కూడా చుండ్రు సమస్య తగ్గుతుంది.