డ్యాన్స్ చేసినందుకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు.. పాపం కదా

ఎవరికైనా సంతోషం అనిపించినప్పుడు డ్యాన్స్ రాకరపోయినా స్టెప్పులు వేస్తూ ఉంటారు.అలాగే ఫంక్షన్లలో డ్యాన్స్ లు వేస్తూ సందడి చేస్తూ ఉంటారు.

 Graduation Certificate Was Not Given For Dancing.. It's A Pity. Dance, Viral Lat-TeluguStop.com

ఇక కాలేజీల్లో కల్చరర్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు స్టూడెంట్స్ డ్యాన్స్ వేస్తూ తమ టాలెంట్‌ను అందరికీ తెలియజేస్తూ ఉంటారు.కాలేజీలు, స్కూళ్లల్లో డ్యాన్సు కాంపిటీషన్లు యాజమాన్యాలు నిర్వహిస్తూ ఉంటాయి.

విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకుని ఆనందపడతారు.అయితే ఒక్కొక్కసారి మనం చూపించే అత్యుత్సాహం వల్ల ఇబ్బందులు కూడా జరగొచ్చు.

అయితే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఒక అమ్మాయికి సర్టిఫికేట్ ఇస్తున్నారు.ఈ సందర్బంగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వచ్చిన ఆనందంలో యువతి స్టేజీపై డ్యాన్స్ మూమెంట్స్ చేసింది.దీంతో డ్యాన్స్ చేసినందుకు యువతికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్( Graduation Certificate ) ఇచ్చేందుకు నిరాకరించారు.దీంతో యువతి షాక్ కు గురైంది.డ్యాన్స్ వేసినందుకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం ఏంటంటూ నోరెళ్లపెట్టుకుంది.ఆమె ప్రదర్శించిన అత్సుత్సాహమే యువతి కోంప ముంచింది.

పట్టా తీసుకోబోతుందనే ఆనందం ఈ పరిణామంతో యువతికి ఆవిరైపోయింది.

అమెరికా( America )లోని ది ఫిలడెల్ఫియా హైస్కూల్ ఫర్ గర్ల్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.జూన్ 9న ఇది జరిగినట్లు తెలుస్తోంది.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నవారికి ప్రిన్సిపాల్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు ఇస్తున్నారు.

ఉత్తీర్ణులైనవారిని స్టేజీపైకి పిలిచి సర్టిఫికేట్లు ఇస్తున్నారు.అలాగే అబ్ధఉల్ రహ్మాన్ అనే 17 ఏళ్ల అమ్మాయికి కూడా సర్టిఫికేట్ ఇచ్చేందుకు పేరును పిలిచారు.

దీంతో యువతి పేరు పిలవగానే డ్యాన్స్ మూమెంట్స్ చేసుకుంటూ స్టేజీపైకి వచ్చింది.దీంతో ప్రిన్సిపాల్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు.

సర్టిఫికేట్ ఇచ్చేది లేదని ప్రిన్సిపాల్ చెప్పడంతో యువతి ఏడ్చుకుంటూ వెళ్లింది.యువతి డ్యాన్స్ మూమెంట్స్ చేసే సమయంలో అక్కడ ఉన్నవారు నవ్వుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube