హైదరాబాద్ కు శాశ్వతంగా "గూగుల్"

ఐటీ.ఇంటెర్నెట్ దిగ్గజం గూగుల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ హైదరాబాద్ ను తన కేంద్రంగా ఎంచుకుంది.

 Google In Hyderabad-TeluguStop.com

ఇప్పటివరకు హైదరాబాద్ లో ఒక అద్దె భవనంలో తమ కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీ త్వరలోనే సరికొత్త హంగులతో రూపుదిద్దుకొనున్న సొంత భవనంలోకి తన బిజినెస్ ను మార్చుకుని అక్కడనుంచే తమ కార్యకలాపాలను కొనసాగించనుంది.ఇప్పటివరకు అటు యూకే,యూఎస్ వంటి బడా దేశాలలో తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకుని వాటినే తన ప్రధాన కేంద్రాలుగా ప్రకటించుకున్న గూగుల్, ఇప్పుడు మూడవ ప్రధాన క్యాంపస్ గా హైదరాబాద్ ను ఎంచుకోవడం శుభపరిణామం.

ఇక ఈ మేరకు కంపెనీ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతో ఎం.ఓ.యూ కుదుర్చుకుంది అని తెలుస్తుంది.అంతేకాకుండా హైదరాబాద్ ను వైఫై సిటీగా మార్చే ఆలోచనతో ఉన్న తెలంగాణా ప్రభుత్వానికి సిస్కో, ఏర్‌టెల్, వొడాఫోన్, తైవాన్ వంటి కంపెనీలు తమ పూర్తి మద్దతును ప్రకటించినట్లు, దానిలో భాగంగానే ఈ వైఫై కాన్సెప్ట్ పై ఆసక్తి చూపుతున్నట్లు ఐటీ.ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సెక్రెటరీ హరప్రీత్ సింగ్ తెలిపారు.ఇకఈ వైఫై కోసం 30కోట్ల రూపాయలతో ఇంక్యుబేటర్ సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరి ఇప్పటికే సాఫ్ట్‌వేర్ హబ్ గా పేరుగాంచిన హైదరాబాద్ నగరం ఈ మార్పులతో మరింత ముందు పోనుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube