ఈ బ్రౌజర్ మీరు వాడుతున్నారా? అయితే మీరు కొరివితో తల గోక్కున్నట్టే!

అవును, మీరు ఇక్కడ చదివింది నిజమే.నేడు స్మార్ట్ ఫోన్స్ అనేవి విశ్వవ్యాప్తం అయినాయి.

 Google Chrome Browser Alert Google, Harmful,beowesr, Alert, Technology Updat-TeluguStop.com

ఇక్కడ స్మార్ట్ ఫోన్ లేని మనిషే ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు.దానికి తోడు ఈ టెలికాం సంస్థలు అత్యంత తక్కువ ధరలకే ఇంటర్నెట్ సదుపాయం ఇవ్వడంతో ముఖ్యంగా యువత ఎక్కువగా బ్రౌజింగ్ చేస్తూనే కాలాన్ని గడిపేస్తున్నారు.

ఈ క్రమంలో వివిధ రకాల బ్రజర్స్ ని వాడుతూ కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు.అత్యధికంగా చూసుకుంటే, గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌ అనేదానిని విరివిగా వాడుతున్నారు.

అయితే ఈ బ్రజర్ వాడినవారికి ఇపుడు ఒక షాకింగ్‌ న్యూస్‌ చెప్పాలి.అదేమిటంటే, క్రోమ్‌ 2022లో అత్యంత ప్రమాదకరమైన ఇంటర్నెట్ బ్రౌజర్‌గా తాజా సర్వేలో తేలింది.

గత 10 నెలల వ్యవధిలో గూగుల్ క్రోమ్ అత్యధికంగా 303 సమస్యలను ఎదుర్కొన్నట్లు అట్లాస్‌ VPN తాజాగా తమ విశ్లేషణలో వెల్లడించింది.అలాగే లైఫ్‌ టైంలో ఈ బ్రౌజర్ మొత్తం 3,159 వల్నరబులిటీలను ఎదుర్కొందని కూడా చెప్పడం కొసమెరుపు.

ఇక ఆ తరువాతి వరుసలో గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌, యాపిల్‌ సఫారీ, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ లాంటి బ్రజర్స్ కూడా ప్రమాదకరమే అని తేలింది.కాగా అట్లాస్‌ VPN జనవరి 1 నుండి అక్టోబర్ 5 వరకు డేటాను పరిశీలించి రివ్యూ చేసింది.

అయితే పరిస్కారం లేదా అంటే, తప్పకుండా వుంది అని చెబుతోంది.బ్రౌజర్‌ వెర్షన్ 106.0.5249.61కి అప్‌డేట్ చేసుకోవడం ద్వారా కొన్ని సమస్యలనుండి బయటపడవచ్చని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube