హిందువులకు శుభవార్త... మరో అతిపెద్ద దేవాలయం ప్రతిష్ట జరగనుంది!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి అందరికీ తెలిసినదే.ప్రపంచస్థాయిలో దీని రూపకల్పన జరుగుతోంది.

 Good News For Hindus Another Big Temple Dedication Is Going To Happen , Hindus-TeluguStop.com

ఈ గుడి పూర్తయిన తర్వాత అక్కడ భక్తులు ఒక అద్భుతాన్నిచూడబోతున్నారు.ప్రతి రోజూ 5-10 నిమిషాలు సూర్య కిరణాలు రాముడి నుదుటిపై బొట్టులా పడేలా ఇక్కడ నిర్మాణం చేప్పట్టడం నిజంగా విశేషంగానే చెప్పుకోవాలి.

ఇలాంటి అద్భుతాలు మన దేశంలో కొన్ని చోట్ల చూడొచ్చు. కోణార్క్‌ ఆలయంలో సూర్య కిరణాలు మూల విరాట్టుని తాకే విధంగా నిర్మాణ శైలి ఉంటుంది.

అలాగే గుజరాత్‌లోని మోధేరా సూర్య దేవాలయంలో సూర్యోదయ సమయంలో కూడా కిరణాలు గర్భగుడిలో ప్రసరిస్తాయి.

అలాగే ఏపీలో.

.అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోకూడా ఏడాదికి రెండుసార్లు ఇటువంటి దృశ్యం ఆవిష్కృతం అవుతుంది.ఇక అసలు విషయానికొస్తే.ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా నేపాల్ లోని పశుపతినాథ్ ఆలయం గురించి మాత్రమే మాట్లాడుకుంటారు.కాగా తాజాగా పశ్చిమ బెంగాల్ లోని మాయాపూర్ లో ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం రూపుదిద్దుకుంటోంది.దీన్ని టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానెటోరియంగా నామకరణం చేశారు.

ఇది 2023లో పూర్తికానుంది.ఇక్కడ సూర్యకిరణాలు పడేరీతిగా నిర్మాణం చేపట్టనున్నారని సమాచారం.

Telugu Biggest Temple, Hindhus, Konark Temple, Latest, Modherasurya, Templevedic

ఇకపోతే ఈ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆలయ ట్రస్ట్​కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.2023 డిసెంబర్ నాటికి భక్తులు దర్శించుకునేందుకు అనుమతి కల్పించనున్నట్లు తెలిపారు.అయితే 1000 సంవత్సరాల ఆల‌యం చెక్కుచెద‌ర‌కుండా ఉండే విధంగా ఆలయ నిర్మాణ‌ ఉండేలా చేస్తున్నామని చేపడుతున్నామని ఈ సందర్భంగా చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube