క్రికెట్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. రీ ఎంట్రీ ఇస్తున్న యువ‌రాజ్ సింగ్

ఇండియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఆయ‌న‌ది తిరుగులుని చ‌రిత్ర అనే చెప్పాలి.ఒక‌ప్పుడు స్టార్ ఆల్ రౌండ‌ర్ గా ఇండియాను ఎన్నో సార్లు గెలిపించిన చ‌రిష్మా అత‌నికి ఉంది.

 Good News For Cricket Fans Yuvraj Singh Making A Re-entry, Cricket, Yuvraj Singh-TeluguStop.com

అయితే అనూహ్యంగా అత‌ను క్రికెట్‌కు గుడ్ బైచెప్పేయ‌డంతో ఆయ‌న అభిమానులు అప్ప‌టి నుంచి తీవ్ర నిరాశ‌లోనే ఉన్నారు.అయితే ఇప్పుడు అత‌ను రీ ఎంట్రి ఇస్తున్న‌ట్టు చెప్పేశాడు.

ఆయ‌నెవ‌రో కాదు స్టార్ ఆల్ రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్‌.తాను ఏడాదిలో ఎంట్రీ ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించేశాడు.

ఫిబ్రవరి నెల‌లో గ్రౌండ్ లో అడుగు పెడుతున్న‌ట్టు చెప్ప‌డంతో ఆయ‌న అభిమానులు ఫుల్ కుషీలో ఉన్నారు.

యువ‌రాజ్ సింగ్ 2019 జూన్‌లో టీమ్ ఇండియాకు గుడ్ బై చెప్పేశాడు.

ఆయ‌న రిటైర్ మెంట్ అనేది అస‌లు ఎవ‌రూ ఊహించ‌న‌టువంటిది.ఎందుకంటే అప్ప‌టికీ స్టార్ ఆల్ రౌండ‌ర్ గానే ఉన్న యువ‌రాజ్‌.

కేవ‌లం కొంత గ్యాప్ రావ‌డంతో ఆ నిర్ణ‌యం తీసుకున్నాడు.పైగా అత‌ని వ‌య‌సు కూడా ఏమంత పెద్ద‌ది కాదు.

దీంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిలో కూరుకుపోయారు.ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌లో ఇండియా త‌ర‌ఫున అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా యువ‌రాజ్ అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా వ‌ర‌ల్డ్ క‌ప్‌ను తీసుకురావ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

Telugu Cup, Rounderyuvraj, Cricket, Cricket Fans, Road Safety, Yuvraj Singh-Late

వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో ఏకంగా మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్‌ను యువ‌రాజ్ అందుకున్నాడంటేనే ఆయ‌న కృషి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.దాదాపు 90.50 సగటుతో 362 ర‌న్స్ చేసిన చ‌రిత్ర యువ‌రాజ్‌కు ఉందంటే ఆయ‌న చ‌రిష్మా అర్థం చేసుకోవ్చు.యువీ చివరిసారిగా గ‌త మార్చి నెల‌లోనే రోడ్ సేఫ్టీ సిరీస్‌లో మైదానంలో ఆడాడ‌ని తెలుస్తోంది.

అయితే ఇప్ప‌టి దాకా ఐపీఎల్ లో ఆడుతున్న అత‌ను.ప్ర‌జ‌ల డిమాండ్ మేర‌కు మ‌ళ్లీ పునరాగమనం చేస్తున్న యువరాజ్ సింగ్ ప్ర‌క‌టించాడు.

త్వ‌ర‌లోనే దీనిపై పూర్తి స్థాయిలో వివ‌రాలు వెల్ల‌డించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube