కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం. ముగ్గురు మహిళా నిందితుల అరెస్ట్.
ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన ఐదు రోజుల శిశువు కిడ్నాప్ కేసు పోలీసులు 10 గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మలికా గర్గ్ తెలిపారు.మార్కాపురం సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఆమె కేసు వివరాలను తెలిపారు.
గుంటూరు జిల్లాకు చెందిన ఏ శ్రీరాములకు.ప్రకాశం జిల్లాకు చెందిన కోమలితో మూడేళ్ల క్రితం వివాహమైంది.
కోమలి మార్కాపురం జిల్లా వైద్యశాలలో ఈ నెల 24న పాపకు జన్మనిచ్చింది.పాపకు కామెర్లు రావడంతో చికిత్స చేయిస్తుండగా 28న గుర్తుతెలియని మహిళ… వైద్యశాల నుంచి శిశువు ను కిడ్నాప్ చేసింది.
శిశువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రూరల్ ఎస్ఐ కోటయ్య తన సిబ్బందితో కలిసి కంభం రోడ్ లో ఉన్న ఓ చిన్నపిల్ల వైద్యశాలకు వెళ్లి తనిఖీ చేశారు.
అక్కడ ఓ మహిళ అనుమానాస్పద గా తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకుని విచారించారు.తన పేరు దూదేకుల రేహాన అని.కంభం అర్బన్ కాలనీ ల నివాసం ఉంటుందని తానే శిశువు కి దొంగతనం చేసానని తెలిపింది.తనకు దూరం బంధువులైన ఖమ్మం లో నివాసం ఉండే హలీమా బేగం, రహమతున్నీసా బేగంలకు శిశువును విక్రయించేందుకు 50,000 అగ్రిమెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది.
నిందితులైన రేహాన, హలీమా బేగం, హమతున్నీసా లను అరెస్ట్ చేసి పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.