ప్రేమ పెళ్లిపై నోరు విప్పిన శృతి హాసన్.. ఏం చెప్పిందంటే?

టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం రీ ఎంట్రీ తో పలు సినిమాలలో బిజీగా ఉంది.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 Shruthi Hassan, Marriage, Social Media, Santhanu Hazarika,latest Tollywood News-TeluguStop.com

హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.పలు సినిమాలలో పాటలు పాడి వినిపించింది.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ప్రేమ పెళ్లి గురించి నోరు విప్పింది.

గతంలో శృతిహాసన్ ఓ ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో ఉండగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో అతడికి బ్రేకప్ చెప్పింది.

ఆ కారణంగా కొన్ని ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.ఇక మరోసారి గూగుల్ పెయింట్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో పడింది.

ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా, మీడియా వేదికగా ప్రకటించింది.పైగా అతడినే పెళ్లి చేసుకుంటానని తెలిపింది.

Telugu Shruthi Hassan-Movie

ప్రస్తుతం అతనితో డేటింగ్ లో ఉండగా అతడితో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన పెళ్లి గురించి కొన్ని విషయాలు పంచుకుంది.శంతన్ తనకు మంచి స్నేహితుడని.తమ ఇద్దరి అభిరుచులు ఒకటేనని తెలిపింది.కళలు, సంగీతం పట్ల అవగాహన ఉందని.అందుకే అతనితో సమయం గడపడానికి ఇష్టపడతానని తెలిపింది.

అన్ని అంశాలలో పర్ఫెక్ట్ మ్యాచ్ అని.పెళ్లి విషయంలో ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అని తెలిపింది.అంతేకాకుండా మీడియాకు కూడా ముందుగానే చెబుతాను అని ప్రకటించింది.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube