పవన్ పుట్టినరోజు.. ఆ 'థియేటర్'లో గబ్బర్ సింగ్ స్పెషల్ షో

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, ఆయన నటన గురించి తెలియని తెలుగు ప్రేక్షకులే లేరు.ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.

 Gabbar Singh Special Show In Sandhaya 70 Mm Theatre Over Pawan Kalyan Birthday,-TeluguStop.com

ప్రస్తుతం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.ఈయన నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అందుకోగా.

బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమాను స్పెషల్ షో గా నిర్వహించారు.

నిన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అంతేకాకుండా బర్త్ డే వేడుకలను బాగా అంగరంగవైభవంగా చేశారు అభిమానులు.ఇదిలా ఉంటే మరింత రికార్డు కొట్టడానికి ఆయన అభిమానులు పలు థియేటర్లలో గబ్బర్ సింగ్ సినిమా స్పెషల్ షో ను నిర్వహించారు.

సెప్టెంబర్ 2న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సంధ్య 70 ఎమ్ ఎమ్ థియేటర్ లో గబ్బర్ సింగ్ సినిమా స్పెషల్ షో వేశారు.

Telugu Gabbar Singh, Pawan Kalyan, Sandhayamm, Tollywood-Movie

సంధ్య థియేటర్లో ఈ షో ప్రదర్శించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.కేవలం సంధ్య థియేటర్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో కూడా ఈ సినిమాను ప్రదర్శించారని తెలుస్తుంది.మొత్తానికి పవన్ బర్త్ డే వేడుకలను స్పెషల్ షో తో బాగా రచ్చ చేశారు అభిమానులు.

Telugu Gabbar Singh, Pawan Kalyan, Sandhayamm, Tollywood-Movie

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడు.ఇందులో పవన్ భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నాడు.మరో డైరెక్టర్ రమేష్ వర్మ తో కూడా ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube