ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. పేదలకు బంపరాఫర్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రస్తుత పరిస్థితుల్లో రోజు రోజుకూ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఏం తినేట్లు లేదు ఏం కొనేట్లు లేదు అని పేదలు భావిస్తున్నారు.

 Free 3 Gas Cylinders Per Year The State Government Has Announced Bumperafar For-TeluguStop.com

ముఖ్యంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.నానాటికి పెరుగుతున్న ధరలతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా వంట గ్యాస్ కొనే స్థితి నుంచి కొనలేని స్థితికి చేరుకుంటున్నారు.ఇటువంటి తరుణంలో ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే తీసుకోవాలని నిబంధనలు విధించింది.

నెలకు గరిష్టంగా 2 కంటే ఎక్కువ తీసుకోకూడదని షరతు పెట్టింది.అలా తీసుకుంటే అధిక ధర చెల్లించాలని ఆదేశాలిచ్చింది.

ఈ తరుణంలో ఓ వైపు నిబంధనలు, మరో వైపు పెరిగిన గ్యాస్ ధరలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఇలాంటి సమయంలో పేదలకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

తమ రాష్ట్రంలో పేదలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది.అంత్యోదయ రేషన్‌కార్డుదారులందరికీ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది.ఇందుకు కొన్ని నిబంధనలు పెట్టింది.లబ్ధిదారులు ఖచ్చితంగా తమ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలని, ఖచ్చితంగా అంత్యోదయ రేషన్ కార్డు ఉండాలని, గ్యాస్ సిలిండర్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసి ఉండాలని సూచించింది.

ఇక ఈ కొత్త పథకం దీపావళి నుంచే అమలు కానున్నట్లు ప్రకటించింది.దీంతో పేదలు, ముఖ్యంగా అంత్యోదయ రేషన్ కార్డులు ఉన్న వారు సంతోషంలో మునిగి తేలుతున్నారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేసిన ప్రకటనతో మిగిలిన రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఆఫర్ అందిస్తాయేమోనని ఆశతో ఉన్నారు.ఇలా గ్యాస్ ధరలు భారీగా పెరిగిన వేళ ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందించిన ప్రకటన పేదల మోముల్లో చిరునవ్వులు నింపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube