2030 నాటికి 30 వేల మంది భారతీయ విద్యార్ధులకు స్వాగతం : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్( Emmanuel Macron ) శుభవార్త చెప్పారు.2030 నాటికి 30 వేల మంది భారతీయ విద్యార్ధులు ఫ్రాన్స్‌లో చదువుకోవడానికి వీలు కలిగించే కార్యక్రమాల వివరాలను పంచుకున్నారు మాక్రాన్.గతేడాది ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) పారిస్‌ను సందర్శించిన ఒక నెల తర్వాత మాక్రాన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో చేసిన ఓ పోస్ట్‌లో 30 వేల మంది భారతీయ విద్యార్ధులు ఫ్రాన్స్‌లో చదువుకోవడానికి వీలు కలిగించే ప్రణాళికను ఆయన పంచుకున్నారు.

 France To Welcome 30,000 Indian Students By 2030: President Macron On 75th Repub-TeluguStop.com
Telugu Republic Day, Emmanuel Macron, France, India, Indian, Jaipur, Narendra Mo

ఫ్రెంచ్ నేర్చుకునేందుకు దేశంలో ఫ్రాంకైస్, అంతర్జాతీయ తరగతుల నెట్‌వర్క్‌తో కొత్త కేంద్రాలు ఎలా అభివృద్ధి చేయబడుతున్నాయని మాక్రాన్ వివరించారు.దేశంలో భారతీయ పూర్వ విద్యార్ధుల కోసం వీసా ప్రక్రియ( Visa Process )ను కూడా ఫ్రాన్స్ సులభతరం చేస్తుందని ఆయన వెల్లడించారు.ఫ్రాన్స్‌కు రావడమంటే శ్రేష్టతను వెతకడమన్నారు.మెరుగైన భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో తాము కొత్త మార్గాలను ప్రారంభిస్తున్నామన్నారు.ఫ్రెంచ్ నేర్చుకోవడానికి కొత్త కేంద్రాలతో అలయన్స్ ఫ్రాంకైస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని మాక్రాన్ వెల్లడించారు.తాము తప్పనిసరిగా ఫ్రెంచ్ మాట్లాడని విద్యార్ధులను మా విశ్వవిద్యాలయాలలో చేరడానికి అనుమతించే అంతర్జాతీయ తరగతులను సృష్టిస్తున్నామని మాక్రన్ పేర్కొన్నారు.

ఫ్రాన్స్‌లో చదివిన ఏ మాజీ భారతీయ విద్యార్ధులకైనా వీసా ప్రక్రియను సులభతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Telugu Republic Day, Emmanuel Macron, France, India, Indian, Jaipur, Narendra Mo

కాగా.గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రాజస్థాన్‌‌ రాజధాని జైపూర్‌( Jaipur )లో మహారాజా సవాయి జై సింగ్ నెలకొల్పిన జంతర్ మంతర్‌ను మాక్రాన్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు.

అంతముందు నగరంలో వీరిద్దరూ రోడ్ షో నిర్వహించారు.వీరికి జైపూర్ నగరవాసులు ఘనస్వాగతం పలికారు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube