ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ పొడిగింపు అయింది.మనీలాండరింగ్ కేసులో భాగంగా జైన్ బెయిల్ ను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆరోగ్య కారణాల దృష్ట్యా ఐదు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను పొడిగించినట్లు ధర్మాసనం పేర్కొంది.ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మధ్యంతర బెయిల్ పొడిగింపు కొనసాగుతుందని స్పష్టం చేసింది.