కొత్త రంగంలోకి అడుగుపెడుతున్న ఫ్లిప్కార్ట్ గ్రూప్.. అంతేకాదు యాప్ కూడా రెడీ..!

భారత్ కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ ఏరకంగా ఆన్లైన్ సేల్స్ లో తన సేవలను కొనసాగిస్తుందో అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో ఇటీవల ఈ గ్రూప్‌ ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ ను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.

 Flipkart Group Entering New Field , Flipkart , Health Care , Application , Ec-TeluguStop.com

దానికోసం నిన్న అనగా బుధవారం సదరు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు నాణ్యమైన మందులు, హెల్త్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ను దేశవ్యాప్తంగా ఉన్న ఇండిపెండెంట్‌ సెల్లర్స్‌ నుంచి కొనుగోలు చేసే వెసులుబాటు కలదు.

అయితే దేశంలోని దాదాపు 20,000 పిన్‌కోడ్‌ల పరిధిలో మాత్రమే ప్రస్తుతానికి ఈ సేవలను ఫ్లిప్‌కార్ట్‌ హెల్త్‌ ప్లస్‌ అందించనుంది.

ఇక ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ లో దాదాపు 500 మంది ఇండిపెండెంట్‌ సెల్లర్స్‌ ప్రస్తుతానికి కలరు.

వీరు మందుల ప్రెస్క్రిప్షన్‌ను బట్టి సరైన మందులు అందజేసేందుకు అవసరమైన ఫార్మాసిస్టులతో లింక్ చేయబడి ఉంటారు.ఈ విషయమై ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌ జావేరి మాట్లాడుతూ.“కరోనా విపత్తు తరువాత ఆరోగ్యం విషయంలో ఇండియాలోని ప్రజలకు అత్యంత శ్రద్ధ పెరిగింది.గతంలో ఎన్నడూ లేనంతగా ఆరోగ్యానికి నేడు ప్రాధాన్యం ఇస్తున్నారు.మా సేవల ద్వారా దేశ ప్రజలకు నాణ్యమైన మందులు, హెల్త్‌కేర్‌ ప్రొడక్టులు అందించేందుకే మా ప్రయత్నం.” అని అన్నారు.

Telugu Ecommerce, Flipkart, Care, Ups, Website-Latest News - Telugu

ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ యాప్‌ విషయానికొస్తే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో ఇది రూపు దిద్దుకుంది.ఈ యాప్‌ను కస్టమర్‌లు సాంకేతిక నైపుణ్యంతో సంబంధం లేకుండానే సులువుగా వాడవచ్చు.దీనిద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో సహా వివిధ ఆరోగ్య సమస్యలతో బాదపడుతున్న వారికి మందులు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ అందించనుంది.ఇక ఈ యాప్‌ను తక్కువ బ్యాండ్‌విడ్త్‌లో కూడా వినియోగించుకోవచ్చు.

ఇది దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లకు అందుబాటులో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube