ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది.విజయరాయిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది.
రేపు చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ బ్యానర్లు ఏర్పాటు చేసింది.మరోవైపు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ప్రగతి యాత్ర ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే టీడీపీ స్వాగత తోరణాలను వైసీపీ కార్యకర్తలు తొలగించారని వివాదం నెలకొంది.టీడీపీ జెండా దిమ్మకు వైసీపీ రంగులు వేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో విజయరాయిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.