ఫాదర్‌ ఆఫ్‌ బీస్‌.. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడకు వెళ్తే అక్కడికి తేనెటీగలు

రెండు మూడు తేనెటీగలు ఉంటేనే భయంతో వణికి పోతూ ఉంటాం.ఇంటికి చుట్టు పక్కల ఎక్కడైనా తేనెటీగలు కనిపిస్తే అవి ఏ సమయంలో దాడి చేస్తాయో అని బిక్కు బిక్కున ఉంటాం.

 Father Of Bees In Ethiopias Oromia Region-TeluguStop.com

ఇక తేనెతుట్టి సమీపంలో ఉంటే దాన్ని తొలగించే వరకు వదిలి పెట్టాం.నిపుణులను తీసుకు వచ్చి తేనెటీగలను తీసేయిస్తాం.

అలాంటిది ఆ మనిషి ఎక్కడ ఉంటే అక్కడ తేనెటీగలు ఉంటాయి, వేరే ఊరుకు వెళ్లినా కూడా తేనెటీగలు ఆయన వెంట వెళ్తాయి.నలుగురిలో ఉన్న సమయంలో కూడా ఆయన చుట్టు తేనెటీగలు చేరి మిగితా నలుగురిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

తేనెటీగలకు ఆయన అంటే మహా ఇష్టం కావచ్చు, ఆయనే గోసా టఫీస్‌.

ఇథియోఫియాకు చెందిన గోసా టఫీస్‌ ఇంటికి 15 సంవత్సరాల క్రితం కొన్ని తేనెటీగలు వచ్చాయట.

ఆ తేనెటీగలను బయటకు పంపించేందుకు ప్రయత్నించాడట.కాని అవి వెళ్లలేదు.

సరే హాని చేయడం లేదు కదా అని వాటిని అలాగే ఉంచాడట.వాటి వృద్ది అనూహ్యంగా పెరిగింది.

పదులు, వందలు, వేలు ఇలా గోసా ఇంట్లో తేనెటీగల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.నెలలో 20 నుండి 30 కేజీల తేనె ఇచ్చేంతగా గోసా ఇంట్లో తేనెటీగలు పెరిగాయి.

అంతటి స్థాయిలో తేనెటీగలు పెరగడంతో గోసా ఇరుగు పొరుగు వారు ఇబ్బంది పడటం మొదలైంది.పలు సార్లు ఇరుగు పొరుగు వారిని తేనెటీగలు కుట్టాయి.

గోసా ఇంట్లో వారిని ఏమనని తేనెటీగలు బయటి వ్యక్తులను మాత్రం పదే పదే ఇబ్బంది పెట్టడం జరిగింది.దాంతో గోసా తన ఇంట్లో ఉన్న ఆ తేనెటీగలను బయటకు పంపించాడు.తేనెతుట్టెను తొలగించినా తేనెటీగలు మాత్రం ఆయన్ను వదలలేదు.తుట్టెలేకపోయినా ఇంట్లో కనీసం ఇరువై ముప్పై తేనెటీగలు ఎప్పుడు ఉండేవి.తేనెటీగల వల్ల తమకు ఎలాంటి సమస్య లేదని, అయితే ఇరుగు పొరుగు వారు ఆందోళన చెందడంతో పాటు, వారికి ఇబ్బంది అని వాటిని తొలగించాను అంటూ గోసా చెప్పుకొచ్చాడు.గోసాకు అక్కడ ఫాదర్‌ ఆఫ్‌ బీస్‌ అని, ఫాదర్‌ ఆఫ్‌ హనీ అంటూ పేర్లు ఉన్నాయి.

గోసా ఇంటి సభ్యులకు కూడా తేనెటీగలు స్నేహితులుగా మారిపోయాయి.ఇప్పటి వరకు గోసాను కాని, ఆయన ఇంటి సభ్యులను కాని ఒక్కటి అంట్టే ఒక్కటి కూడా తేనెటీగ కరిసింది లేదు.

ఇది ఎలా సాధ్యమో ఆయనకు అర్థం కావడం లేదు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా జుట్టు పీక్కుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube