కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.బద్వేలు మండలం నందిపల్లె సమీపంలో ఆటోను మినీ లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.
మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే గమనించిన స్థానికులు బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు.అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
తరువాత రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతులు బి.మఠం, సిద్ధవటం మండలాల వాసులుగా గుర్తించారు.