టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నటించే ప్రతి ఒక సినిమాకి ఆయన కూతురు సుష్మిత కొణిదెల( Sushmita Konidela ) కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఎప్పటినుంచో ఆమె కాస్ట్యూమ్ డిజైనర్( Costume Designer ) వ్యవహరిస్తూ వస్తున్నారు.
చిరంజీవి సినిమా వస్తోంది అంటే చాలు సుష్మిత తన క్యాస్టూమ్స్ తో అందరినీ నిరాశ పర్చుతూనే వస్తోంది.ఖైదీ నంబర్ 150 సొంత ప్రొడక్షన్ కావడం.
సుష్మిత క్యాస్టూమ్స్ డిజైన్ చేయడం, ఆ సినిమాకు ఆ క్యాస్టూమ్స్ బాగానే సెట్ అవ్వడం ఫ్యాన్స్‌కి నచ్చడంతో ఎక్కడా విమర్శలు రాలేదు.కానీ ఆ తరువాత చిరంజీవి నటించిన వరస సినిమాలు సైరా, గాడ్ ఫాదర్, భోళా శంకర్, ఆచార్య ఇలా ఏ ఒక్క చిత్రంలోనూ చిరంజీవి క్యాస్టూమ్స్ ను చూసి అభిమానులు సంబర పడలేదు.
దీంతో సుష్మిత క్యాస్టూమ్స్ డిజైన్ పట్ల అందరికీ వ్యతిరేకత వచ్చేసింది.అలా అని మెచ్చుకోదగ్గ స్థాయిలో కూడా కాస్ట్యూమ్స్ లేవు.దీంతో ఆ విషయంలో మెగా అభిమానులు కాస్త కోపంగానే ఉన్నారు.ఇకపోతే ఇప్పుడు చిరంజీవి కొత్త చిత్రాన్ని ప్రకటించారు.శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వం, నాని( Nani ) సమర్ఫణలో ఈ చిత్రం రాబోతోంది.ఈ క్రమంలో ఫ్యాన్స్ అంతా కూడా అనిరుధ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
కొంత మంది మాత్రం అనిరుధ్ కావాలని కాదు, ముందు సుష్మిత అక్క వద్దని డిమాండ్ చేయండంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.మెగా ఫ్యాన్స్ సైతం నాని, శ్రీకాంత్ ఓదెలకు ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఈ మూవీ వింటేజ్ విలేజ్ డ్రామా అంటున్నారు కదా, ఈ మూవీకి అయినా సుష్మితను పక్కన పెట్టేయాలని కోరుతున్నారు మెగా ఫాన్స్.అంతేకాకుండా గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలోని కాస్ట్యూమ్ ఫోటోలను షేర్ చేసి మరీ సుస్మితాను దూరం పెట్టాలి అంటూ కోరుకుంటున్నారు.మరి ఈ రిక్వెస్టులు నాని, శ్రీకాంత్ ఓదెల, చిరంజీవి వద్దకు వెళ్తుందా? అసలు ఈ మాటల్ని చిరంజీవి పట్టించుకుంటాడా? డైరెక్టర్, నాని చెప్పిన మాటల్ని వింటారా? అన్నది చూడాలి మరి.ఇంకొందరు అభిమానులు ఇప్పుడు చిరంజీవి నటించిన పోయే సినిమా అయినా తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు.ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిరంజీవి చాలా వరకు సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవి సక్సెస్ కాలేకపోతున్నాయి.