Fake emails to actresses and models in the name of director

సాధారణంగా ఒక కొత్త అమ్మాయి లేదా, కొంచెం అనుభవం ఉన్న అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలంటే, ముందు కాస్టింగ్ ఎజెన్సి వారికి కబురు పెడతారు దర్శకనిర్మాతలు.

ఆ కాస్టింగ్ ఎజెన్సి పంపించిన ఫ్రొఫైల్స్ చూసి, నచ్చిన అమ్మాయిలను షార్ట్ లిస్ట్ చేసి, వారిని ఆడిషన్ చేసి, అందులో నచ్చిన అమ్మాయిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవడం ఓ పద్ధతి.

అందరూ ఇలానే చేస్తారని కాదు, కొందరు దర్శకులు ఎక్కడో టీవి యాడ్ లోనో, ఫోటోషూట్ లోనో అమ్మాయి నచ్చగానే కబురు పెడతారు.కాని, దర్శకుడు స్వయంగా మోడల్స్ కి మేయిల్ పెట్టడం అనేది పెద్దగా వినలేదు.

ప్రస్తుతం డైరెక్టర్ ఎస్.జే.సూర్య పేరు మీద చాలామంది మోడల్స్ కి, చిన్న నటీమణులకి మేయిల్స్ వెళ్తున్నాయట.కొత్త సినిమా కోసం సూర్య హీరోయిన్ ని వెతుకుతున్నట్లు, వచ్చి చర్చల్లో పాల్గొనమన్నట్లు ఉన్నాయి ఆ మేయిల్స్.

ఎస్.జే.సూర్య పెద్ద దర్శకుడే కదా.పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్, అజిత్ లాంటి అగ్రహీరోలతో సినిమాలు చేసిన దర్శకుడు సూర్య.అలాంటి దర్శకుడి పేరుతో మేయిల్స్ వస్తే ఏ అమ్మాయి మాత్రం సంబరపడదు.

Advertisement

దాంతో ఎస్.జే.సూర్య ఆఫీస్ కి ఫోన్స్ రావడం ఎక్కువైంది.ఇదెక్కడి గోలరా బాబు, నేను ఎవరికి మేయిల్స్ పంపలేదు, నా పేరుతో ఎవరో అనామకులు చేస్తున్న పని ఇది, ఏమైనా తేడా మేయిల్స్ ఎవరికైనా వచ్చినా, నన్ను అపార్థం చేసుకోవద్దు, నేనెవరికి మేయిల్స్ పంపట్లేదు అని చెబుతున్నాడు సూర్య.

పాపం .పెద్ద కష్టమే వచ్చింది.ఈ దర్శకుడి అదృష్టం కొద్దీ, ఇప్పటివరకైతే తన పేరు మీద ఎవరికి అసహ్యకరమైన మేయిల్స్ మాత్రం అందలేదట.

Advertisement

తాజా వార్తలు