Aashirwad Bungalow : ఆ బంగ్లాలో నివసించి దివాలా తీసిన ముగ్గురు స్టార్ హీరోలు.. అందులో ఉంటే నాశనం తథ్యం..??

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇంటికి సంబంధించిన నమ్మకాలు కోకొల్లలు అని చెప్పవచ్చు.

 Facts About Aashirwad Bungalow Bought Actors Rajesh Khanna Rajendra Kumar Bhara-TeluguStop.com

ఇల్లు వాస్తు బాగోలేకపోతే ఆరోగ్యాల బారిన పడటం, లేదంటే చనిపోవడం జరుగుతుందని చాలామంది నమ్ముతారు.కొంతమంది ఆస్తి కోల్పోయే ప్రమాదం కూడా ఉందని విశ్వసిస్తారు.

ఇక కొన్ని ఇళ్లలో దుష్ట శక్తులు ఉన్నాయని, నెగిటివ్ ఎనర్జీలు నాట్యం చేస్తున్నాయని, వాటి వల్ల ఆ ఇళ్లలో నివసించిన వారు సర్వస్వం కోల్పోతారని అనుకుంటారు.అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ముగ్గురు స్టార్ హీరోల జీవితాలను పరిగణనలోకి తీసుకుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది.

ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకే భవనంలో నివసించారు.అయితే ఆ ముగ్గురు స్టార్ హీరోలు కూడా ఆ సర్వస్వం కోల్పోయి దివాలా తీశారు.

వారెవరో, ఆ శాపగ్రస్తమైన బంగ్లా ఏంటో తెలుసుకుందాం.

Telugu Bharat Bhushan, Rajendra Kumar, Rajesh Khanna, Bollywood, Mumbaiaashirwad

ముంబై మహా నగరంలో కార్టర్ రోడ్ ప్రాంతంలో ’ఆశీర్వాద్’( Aashirwad Bungalow ) అనే ఓ బంగ్లా ఉంది.ఇందులో వేర్వేరు సమయాల్లో ముగ్గురు బాలీవుడ్ సూపర్ స్టార్లు నివసించారు.అది యాదృచ్ఛికమో, లేదంటే ఆ ఇంటిలో ఏదైనా శక్తి ఉందో తెలియదు కానీ ఈ ముగ్గురు హీరోల కెరీర్‌ కూడా సర్వనాశనం అయిపోయింది, చివరికి వారి పరిస్థితి దయనీయంగా మారింది.

ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి చివరికి ఇంటిని అమ్మేశారు.వారి పేర్లు రాజేష్ ఖన్నా, భరత్ భూషణ్, రాజేంద్ర కుమార్.

Telugu Bharat Bhushan, Rajendra Kumar, Rajesh Khanna, Bollywood, Mumbaiaashirwad

‘ఆశీర్వాద్‌’ బంగ్లాను మొదటి సారిగా భరత్ భూషణ్( Bharat Bhushan ) 1950 కాలంలో ఆంగ్లో-ఇండియన్ ఫ్యామిలీ నుంచి కొన్నాడు.ఆయన అప్పటికే బాక్సాఫీస్ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ ఇంటిని కొనుగోలు చేశాక కూడా బైజు బావ్రా, గేట్‌వే ఆఫ్ ఇండియా, మీర్జా గాలిబ్, బర్సాత్ కీ రాత్ వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు.అయితే 1950 దశాబ్దం చివరిలో వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ అతడిని అప్పులపాలు చేశాయి.

చివరికి అతడు ఆ బంగ్లాను అమ్ముకోక తప్పలేదు.అతడు దీనిని అమ్మిన తర్వాత ఈ బంగ్లాలో నివసించిన వారిని దురదృష్టం వెంటాడుతుందని కథనాలు వెల్లువెత్తాయి.

Telugu Bharat Bhushan, Rajendra Kumar, Rajesh Khanna, Bollywood, Mumbaiaashirwad

ఈ స్టోరీలను కొట్టి పారేస్తూ ఈ బంగ్లాను రైజింగ్ స్టార్ రాజేంద్ర కుమార్( Rajendra Kumar ) 1960లలో ఏకంగా 60 వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు.కానీ అతడికి కూడా సేమ్ కెరీర్ వైఫల్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.చివరి దాన్ని అమ్మేశాడు.తర్వాత అప్‌కమింగ్ హీరోగా కెరీర్‌లో దూసుకుపోతున్న బాలీవుడ్‌ స్టార్ రాజేష్ ఖన్నా( Rajesh Khanna ) 1970 కాలంలో ఆశీర్వాద్ బంగ్లా కొనుగోలు చేశాడు.

మొదట ఆ బంగ్లా అతడికి కలిసి వచ్చినట్లుగా అనిపించింది, ఎందుకంటే అతడు హిందీ మూవీ పరిశ్రమలో అనతి కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగాడు.నిజానికి ఈ బంగ్లాకి అతడు ముద్దుగా ఆశీర్వాద్‌ అని కూడా పేరు పెట్టుకున్నాడు.

ఆ కాలంలో ఈ బంగ్లా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది.అయితే 1970 దశకం చివరి నాటికి రాజేష్ సంపాదించుకున్న పేరు మొత్తం పోయింది, అతడి కెరీర్ తలకిందులైంది.

భార్య కూడా అతడి నుంచి విడిపోయింది.ఆ బంగ్లాలో బాధపడుతూనే కొన్ని నెలలకు రాజేష్ కన్నా చనిపోయాడు.

అలా ముగ్గురు కెరీర్లను ఈ బంగ్లా నాశనం చేసింది.చివరికి దీనిని 90 కోట్లకు ఒక పారిశ్రామికవేత్త కొనుగోలు చేశాడు.2016లో దీనిని కూల్ చేసి కొత్త దాన్ని నిర్మించడానికి ప్లాన్ వేశారు.ఇప్పటికీ ఈ బంగ్లా బాలీవుడ్ ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube