ఎర్ర‌బెల్లి టీడీపీకా...? ర‌మ‌ణ టీఆర్ఎస్‌కా..?

ఇప్పుడు తెలంగాణ టీడీపీ, టీఆర్ ఎస్ నేత‌ల్లో ఇదే విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.టీడీపీలో కీల‌క స్థానంలో ఉండి హ‌ఠాత్తుగా టీఆర్ ఎస్‌లో చేరిన సీనియ‌ర్ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌.

 Errabelli To Join Tdp..?-TeluguStop.com

ఇప్పుడు సెంట‌రాఫ్‌ది పాయింట్‌గా మారారు.అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో టీడీపీని న‌డిపిస్తున్న ఎల్ ర‌మ‌ణ.

ఎర్ర‌బెల్లితో గంట‌ల త‌ర‌బ‌డి భేటీ అయ్యారు.దీంతో ఈయ‌న‌పైనా అనేక చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

మొత్తానికి ఈ ఇద్ద‌రి య‌వ్వారం రంజుమీదుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.మ‌రి విష‌యం ఏంటో తెలియాలంటే.

ఇది చ‌ద‌వాల్సిందే!

ప్ర‌స్తుతం ఎర్ర‌బెల్లి.టీఆర్ ఎస్ నేత‌గా చ‌లామ‌ణి అవుతున్నారు.

అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌ను తీసుకుంటే.ఆయ‌న‌కు పెద్ద‌గా గుర్తింపు రాలేద‌ని, టీడీపీలో ఉంటేనే బాగుండేద‌ని ఆయ‌న అనుచ‌రులు అనుకున్నారు.

అంతేకాదు, పార్టీలో చేరేడ‌ప్పుడు చూపిన చొర‌వ .త‌ర్వాత టీఆర్ ఎస్ అధినేత చూప‌లేద‌ని కూడా అన్నారు.ఈక్ర‌మంలో తాజాగా ఎర్ర‌బెల్లి.ఎల్ ర‌మ‌ణ‌తో భేటీ కావ‌డం వెనుక తిరిగి త‌న సొంత గూడు టీడీపీలోకి వ‌స్తున్నారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.మ‌రోప‌క్క‌, టీడీపీ కి దిక్కుగా ఉన్న ఎల్ ర‌మ‌ణ‌.ప‌రిస్థితి అంతంత మాత్రంగా ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ర‌మ‌ణ మాట‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది.దీనికితోడు వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో అయినా.

టీడీపీ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం మాట అటుంచి.ఇప్పుడున్న పాటి అసెంబ్లీ స్థానాలైనా వ‌స్తాయా? అనేది సందేహంగా మారింది.టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీపైనే కాన్స‌ట్రేష‌న్ చేయ‌డం.ఉన్న లోకేష్ కూడా ఏపీకే మ‌కాం మార్చేయ‌డం తో ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి తెలంగాణ అగ‌మ్య‌గోచ‌రంగా మారింది.దీంతో ఇక‌, తాను ఈ పార్టీలో ఉండి ప్ర‌యోజనం ఏంట‌ని ర‌మ‌ణ అనుకుంటున్నార‌ని స‌మాచారం.ఈ నేప‌థ్యంలో ర‌మ‌ణ పార్టీ మారి టీఆర్ ఎస్‌లోకి వెళ్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ రెండు విష‌యాల నేప‌థ్యంలో ఎర్ర‌బెల్లి,.ర‌మ‌ణ‌ల భేటీ ఆస‌క్తిగా మారింది.

ఎర్ర‌బెల్లి నేరుగా ర‌మ‌ణ ఇంటికే వెళ్లి నాలుగు గంట‌లు భేటీ కావ‌డం.గ‌తంలోనూ ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరగ‌డం వంటివి గ‌మ‌నిస్తే.

ఈ రెండింటిలో ఏదో ఒక‌టి జ‌ర‌గడం ఖాయ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.ర‌మ‌ణ గ‌న‌క ఈ డెసిష‌న్ తీసుకుంటే.

తెలంగాణ టీడీపీ ఆఫీస్ కి తాళం ప‌డ‌డం ఖాయంగా కూడా క‌నిపిస్తోంద‌నే టాక్ ఉంది.అలా కాకుండా.

ఎర్ర‌బెల్లే.టీఆర్ ఎస్‌ను విడిచిపెట్టి టీడీపీలోకి చేరేతే సంచ‌ల‌న‌మే అంటున్నారు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube