దిగ్గజ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్( Elon Musk ) ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.దీన్ని కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ రెవిన్యూ చాలా తగ్గిందని వార్తలు వచ్చాయి.
ఆ విషయం పక్కన పెడితే మస్క్ ట్విట్టర్ ద్వారా వ్యక్తిగతంగా చాలా లాభపడుతున్నారు.ట్విట్టర్ ద్వారా నెలకు అక్షరాలా రూ.81 లక్షలు సంపాదిస్తున్నారు.
ట్విట్టర్( Twitter )లో క్రియేటర్ల అకౌంట్స్‌కి ఫాలోవర్లు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.కాగా మస్క్ అకౌంట్‌కి దాదాపు 24,700 మంది యూజర్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.ఈ విషయం మస్క్ ఇటీవల షేర్ చేసిన ఒక స్క్రీన్ షాట్ ద్వారా తెలిసింది.కాగా ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారానే మస్క్ నెలకు రూ.81 లక్షలు వెనకేసుకుంటున్నారు.ఇండియా( India )లో మస్క్ అకౌంట్‌కి సబ్‌స్క్రిప్షన్ పొందడానికి నెలకి రూ.390 చెల్లించాల్సి ఉంటుంది.ఇక ఇతర దేశాల్లో నాలుగు డాలర్లు (రూ.329) లేదా అంతకు సమానమైన డబ్బు చెల్లించడం ద్వారా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది.సబ్‌స్క్రైబర్ల సంఖ్యను, ఒక్కో యూజర్ చెల్లిస్తున్న కనీస సబ్‌స్క్రిప్షన్ ధరను గుణిస్తే రూ.81 లక్షలు వస్తుంది.అలా మస్క్ ఇంత మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు.
ఎలాన్ మస్క్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ హోమ్ పేజీలో ఫాలో బటన్‌కి ముందు మీకు పింక్ కలర్‌లో ఒక పర్సన్ ఐకాన్ కనిపిస్తుంది.దీనిపై క్లిక్ చేస్తే సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్స్ అన్నీ కనిపిస్తాయి.ఈ బెనిఫిట్స్‌లో మస్క్ నుంచి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను సబ్‌స్క్రైబర్లు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు.
వారానికి ఒకసారి ‘ఆస్క్ మీ ఎనీథింగ్‘ సెషన్‌లో మస్క్‌ను ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందొచ్చు.అంతేకాదు, ప్రత్యేక డిస్కషన్లు కూడా చేయగలుగుతారు.
మొత్తం మీద, ట్విట్టర్‌లో కూడా పెద్దగా కష్టపడకుండా డబ్బులు సంపాదించవచ్చనే దానికి ఎలాన్ మస్క్ లివింగ్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తున్నారు.మస్క్ బుర్ర మాములుది కాదని ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.