ఉచిత విద్యుత్ పై తాను చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.విద్యుత్ ఉద్యమంలో రైతులను పొట్టనపెట్టుకున్నదే కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు.
ఆనాడు టీడీపీలో హెచ్ఆర్డీ ఛైర్మన్ గా కేసీఆర్ ఉన్నారన్న రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ ఇవ్వడం కుదరదని టీడీపీ చేత చెప్పించిందే కేసీఆర్ అని పేర్కొన్నారు.ఈ క్రమంలో రైతులను కాల్చి చంపడానికి కారణం కేసీఆరేనని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులపై పెట్టిన కేసులను ఎత్తేశారని చెప్పారు.ఆనాడు ఏడు గంటల ఉచిత విద్యుత్ ఫైల్ పై వైఎస్ఆర్ సంతకం పెట్టారని చెప్పారు.
అంతేకాకుండా రైతులకు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు.ఏపీకి నష్టం జరిగినా తెలంగాణకు 53 శాతం కేటాయింపులు జరిగాయన్నారు.
కాంగ్రెస్ వలనే ఇవాళ తెలంగాణలో విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు.