నేషనల్ క్రష్ రష్మికా మందన్నా( Rashmika Mandanna ) ప్రస్తుతం అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తుంది.తెలుగు, తమిళం, కన్నడ భాషలతో పాటు బాలీవుడ్లోనూ అడుగుపెట్టింది.
అక్కడ పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది.అయితే ఇటీవల తెలుగు తెరపై తెలంగాణ యాసతో వచ్చే సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
అంతేకాకుండా తెలంగాణ యాస, సంస్కృతి, సంప్రదాయాలను చూపించే సినిమాలే ఎక్కువగా హిట్ అవుతున్నాయి.ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఏ సినిమా చూసుకున్నా.
తెలంగాణ యాసలో వచ్చే సినిమాలే ఉంటున్నాయి.
ఇక హీరోయిన్లు కూడా తెలంగాణ యాసను( Telangana slang ) నేర్చుకుంటున్నారు.సాయిపల్లవి చాలా సినిమాల్లో తెలంగాణ పిల్లగా నటించి తన యాసతో ఆకట్టుకుంది.సినిమాల్లో తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.
ఇక సాయిపల్లవి బాటలోనే చాలామంది హీరోయిన్లు నడుస్తున్నారు.కానీ కొంతమంది హీరోయిన్లకు తెలంగాణ యాస సరిగ్గా రాక ఎలా పడితే అలా చెప్పి విమర్శల పాలవుతున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రష్మిక తెలంగాణ యాసలో వచ్చేశెయ్.నీయవ్వ అని మాట్లాడింది.
కొన్ని ఛానళ్లు రష్మిక అద్బుతంగా తెలంగాణ యాసలో మాట్లాడిందని చెబుతూ హడావుడి చేశాయి.పెద్ద పెద్ద థంబ్ నైల్స్ పెట్టి యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేశాయి.
ఈ వీడియోలపై నెటిజన్లు మండిపడుతున్నారు.నీయవ్వ అనేది తెలంగాణ యాసనా అంటూ మండిపడుతున్నారు.రష్మిక తెలంగాణ యాస కూడా సరిగ్గా లేదని, దానికి మళ్లీ తెలంగాణ యాస ఇరగదీసిందని రాయడంపై విమర్శలు కురిపిస్తున్నారు.ఎవరో నాలుగు మాటలు చెబితే బట్టీ పట్టి కెమెరా ముందు చెబితే తెలంగాణ యాస వచ్చినట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు.
నీయవ్వ అంటూ పిచ్చికూతలు కూస్తే దానిని తెలంగాణ యాసగా చిత్రీకరిస్తూ భాషను తప్పుద్రోవ పట్టిస్తున్నారని సీరియస్ అవుతున్నారు.ఇక కీర్తి సురేష్( Keerthy Suresh ), సాయిపల్లవి కూడా సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడారు.
సాయిపల్లవి కాస్త ఫరవాలేదు అనిపించింది.ఇక సాయిపల్లవితో పోలిస్తే కీర్తి సురేష్ ఇటీవల వచ్చిన దసరా సినిమాలో తెలంగాణ యాసతో ఆకట్టుకుంది.
ఆమె యాస కాస్త దగ్గరగా అనిపించిందని నెటిజన్లు చెబుతున్నారు.