హైదరాబాద్ జాబ్ ఫ్రాడ్ వ్యవహారంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ప్రజాపతి అనే వ్యక్తి మోసం చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సోషల్ మీడియాలో లింకులు పంపి నిరుద్యోగుల నుంచి రూ.720 కోట్ల వసూలు చేసినట్లు అధికారులు నిర్ధారించారని సమాచారం.నిందితుడు గుజరాత్ కు చెందిన వాడిగా గుర్తించారు.దుబాయ్ వేదికగా భారతీయ నిరుద్యోగులే టార్గెట్ గా ప్రజాపతి మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.కాగా ప్రజాపతిపై ఇప్పటికే సీసీఎస్ లో కేసు నమోదు అయింది.అంతేకాకుండా నిందితుడు ప్రజాపతి ఉగ్రవాద సంస్థలకు నిధులు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ జాబ్ ఫ్రాడ్ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.