సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.ఈ మేరకు దసరా పండుగను పురస్కరించుకుని దసరా కానుకగా బోనస్ అందించనుంది.
ఈ నేపథ్యంలో ఒక్కో కార్మికుడికి రూ.లక్షా 53 వేల బోనస్ ప్రకటించింది.మొత్తం 42 వేల మంది కార్మికులకు రూ.లక్షా 53 వేల చొప్పున బోనస్ అందనుంది.పండుగకు మూడు రోజుల ముందే అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు.అయితే సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ గతేడాది సాధించిన రూ.2,222.46 కోట్ల లాభంతో 32 శాతాన్ని దసరా పండుగకు బోనస్ అందిస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతంలో కన్నా ఎక్కువ శాతాన్ని లాభాల వాట ప్రకటించిన సీఎం కేసీఆర్ కు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.