'సీతారామం' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంత తక్కువ చేసిందా?

దుల్కర్ సల్మాన్ హీరో గా హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సీతారామం సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 Dulqure Salman Movie Sitraramam Pre Release Business , Dulqure Salman, Film News, Rashmika Mandana,sitaramam, Tollywood News Sitraramam Pre Release Business-TeluguStop.com

సినిమా కు భారీ ఎత్తున ప్రమోషన్ ను నిర్వహించారు.బాహుబలి స్టార్ ప్రభాస్సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం వల్ల సినిమా కు భారీ గా హైప్‌ పెరిగింది అనటంలో సందేహం లేదు.

సినిమా విజువల్స్ ని చూస్తూ ఉంటే కచ్చితంగా 30 నుండి 40 కోట్ల రూపాయలు అంతకు మించి కూడా అయి ఉంటుంది అంటూ అంతా భావిస్తున్నారు.కాస్టింగ్ తక్కువ ఉన్నా కూడా భారీగా సన్నివేశాలు ఉన్నాయి.

కనుక ఈ సినిమా భారీ బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు.సినిమా బడ్జెట్ ఎంత అనేది విషయం లో క్లారిటీ లేదు కానీ సినిమా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ.16.5 కోట్ల బిజినెస్ మాత్రమే చేసినట్లుగా సమాచారం అందుతోంది.

నైజాం ఏరియా లో రూ.4 కోట్ల కు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది.ఈ సినిమా ను సీడెడ్ ఏరియా లో కేవలం కోటిన్నర రూపాయలు మాత్రమే కొనుగోలు చేశారట.ఇక ఏపీ లో ఆర్ కోట్ల రూపాయలకు ప్రముఖ నిర్మాత దక్కించుకున్నాడు అనేది సమాచారం.మొత్తం గా ఏపీ మరియు తెలంగాణ లో కేవలం 11.5 కోట్ల రూపాయలను ఈ సినిమా బిజినెస్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.16.5 కోట్ల రూపాయల బిజినెస్ లో చేసిన నేపథ్యం లో 17 కోట్ల బ్రేక్ ఈవెన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ మధ్య కాలం లో విడుదలైన సినిమా లు రూ.17 కోట్లు వసూలు చేయడం అంటే పెద్ద కష్టం కాదు, మినిమంగా ఉందని టాక్ ను దక్కించుకుంటే సినిమా కచ్చితంగా 17 కోట్లు రాబట్టిన అవకాశాలు ఉన్నాయి.ఇక్కడ పెద్ద డౌట్ ఏంటంటే.సినిమా కు భారీ ఎత్తున ఖర్చు పెట్టినట్లు అనిపిస్తుంది, కానీ మరీ తక్కువగా సినిమా బిజినెస్‌ చేయడానికి కారణం ఏంటి అంటి అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.

అసలు విషయం ఏంటీ అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube