MP Raghuram Krishnamraju , Prabhas : ప్రభాస్ ఫ్యామిలీ కే బీజేపీ టికెట్ ? రఘురామకు లేనట్టేనా ? 

టీడీపీ, బీజేపీ, జనసేన( TDP, BJP, Jana Sena ) పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.టిడిపి,  జనసేన ల మధ్య ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది.

 Does Prabhas Family Have No Bjp Ticket For Raghuram-TeluguStop.com

అయితే అనూహ్యంగా బీజేపీతో పొత్తు కుదరడంతో  సీట్ల సర్దు బాటు విషయంలో అనేక మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.ఈరోజు బీజేపీ అభ్యర్థుల జాబితా దాదాపుగా ఫైనల్ కాబోతోంది.

ఈ మేరకు మూడు పార్టీలు నేతలు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.దీంట్లో బీజేపీకి కేటాయించబోయే సీట్లు ,అభ్యర్థుల పేర్లు దాదాపు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే బిజెపితో పొత్తు కారణంగా జనసేన పొత్తులో భాగంగా తీసుకున్న కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది.మూడు లోక్ సభ స్థానాలను ఇప్పటికే టిడిపి కేటాయించింది .అయితే ఇప్పుడు బిజెపి కి సీట్ల కేటాయించాల్సి ఉండడంతో జనసేన రెండు ఎంపీ స్థానాల్లో మాత్రమే పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది.

Telugu Prabhasbjp, Janasena, Janasenani, Krishnam Raju, Narendra Varma, Pavan Ka

బిజెపి కనీసం 6 పార్లమెంట్ స్థానాలను తమకు పొత్తు లో భాగంగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉండడంతో , తప్పనిసరి పరిస్థితిలో జనసేన 2 ఎంపీ సీట్ల కే పరిమితం కాబోతోంది .నర్సాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు( MP Raghuram Krishnamraju ) వైసిపికి రాజీనామా చేసిన క్రమంలో,  వచ్చే ఎన్నికల్లో మళ్లీ జనసేన , టిడిపి అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు అయితే బిజెపితో పొత్తు కుదరడంతో ఆయన బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా , ఎంపీగా పోటీ  చేయాలని చూశారు.అయితే బిజెపి మాత్రం రఘురామ కు టికెట్ ఇచ్చేందుకు అంత ఆసక్తి చూపించడం లేదు.

కచ్చితంగా నరసాపురం నుంచి బిజెపి పోటి చేయబోతుండడంతో ఇక్కడ మంచి బలమైన నేపథ్యం ఉన్న వారిని పోటీకి దింపాలని చూస్తోంది.

Telugu Prabhasbjp, Janasena, Janasenani, Krishnam Raju, Narendra Varma, Pavan Ka

 దీనిలో భాగంగానే మాజీ బిజెపి ఎంపీ సినీ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామల దేవి( Shyamala Devi ) కి లేదా ప్రభాస్( Prabhas ) సోదరుడు నరేంద్ర వర్మకు గాని ఈ టిక్కెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంది.ఈ విషయంలో బిజెపి వారితో సంప్రదింపులు చేసినట్లు సమాచారం.  ప్రభాస్ కు ఉన్న సినీ ఇమేజ్ ను ఉపయోగించుకోవాలి చూస్తోంది బిజెపి .అందుకే ఈ టికెట్ ప్రభాస్ కుటుంబానికి కేటాయించాలని చూస్తోంది .దీంతో నరసాపురం టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న రఘురామకృష్ణ రాజు అశలు అడియాశలు కాబోతున్నట్లు గా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube