ప్రస్తుత కాలంలో కొందరు వ్యక్తులు వైద్యుల ముసుగు ధరించి చేసేటటువంటి పనుల కారణంగా వైద్యుడు అన్న పదానికి కళంకం తెస్తున్నారు. తాజాగా ఓ వైద్యుడు ఆయుర్వేదిక్ మసాజ్ పేరుతో ఓ యువతిపై దారుణంగా అత్యాచారం చేసి ఈ అఘాయిత్యాన్ని వీడియో కూడా తీసి చివరికి తాను అడిగినప్పుడల్లా తన కోరిక తీర్చకపోతే ఆ వీడియోలని, ఫోటోలని ఇంటర్నెట్లో షేర్ చేస్తానని బెదిరించిన ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన పూణే పట్టణ పరిసర ప్రాంతంలో ఓ వైద్యుడు ఆయుర్వేదిక్ క్లినిక్ నడుపుతున్నాడు.ఈ క్రమంలో ఇటీవలే స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతి కొంతమేర అనారోగ్యానికి గురవ్వడంతో చికిత్స కోసం వచ్చింది.
దీంతో యువతికి పలు మాయమాటలు చెప్పి మసాజ్ పేరుతో ఆమెను లొంగతీసుకునే ప్రయత్నాలు చేశాడు.అలాగే బలవంతంగా ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు.అంతేకాక అత్యాచారం చేస్తున్న సమయంలో సీక్రెట్ కెమెరా ని ఉపయోగించి వీడియో కూడా తీశాడు.దీంతో తాను అడిగినప్పుడల్లా తన కోరిక తీర్చకపోతే ఈ వీడియోలని ఇంటర్నెట్లో షేర్ చేస్తానని బెదిరించి సాగాడు.
తన కుటుంబ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించినటువంటి యువతికి కిక్కురుమనకుండా ఉండి పోయింది.ఈ మధ్యకాలంలో వైద్యుడు చేస్తున్నటువంటి అరాచకాలు మరింత ఎక్కువవుతుండడంతో భరించలేక చివరికి యువతి తన కుటుంబ సభ్యుల సహాయంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కీచక వైద్యుడిని అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు.