రణవీర్ దీపికా ఇద్దరి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రణవీర్ సింగ్ ( Ranaveer Singh ) దీపికా పదుకొనే జంట ఒకటి.వీరిద్దరూ కలిసి రామ్ లీల సినిమాలో నటించారు.

 Do You Know Totla Assests Value Of Ranaveer Singh And Deepika Padukone Full Deta-TeluguStop.com

ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడినటువంటి ఈ జంట దాదాపు ఆరు సంవత్సరాలు పాటు ప్రేమలో మునిగి తేలుతూ 2018 వ సంవత్సరంలో ఇటలీలో వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇలా పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టినటువంటి ఈ దంపతులు ఒకవైపు తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు వృత్తిపరమైన జీవితాన్ని కూడా ఎంతో సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకు వెళుతున్నారు.

Telugu Bollywood, Deepika, Ranaveer Singh, Ranveer Singh-Movie

ఇలా నటీనటులుగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.వీరిద్దరూ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా మరోవైపు పలు వ్యాపారాలను కూడా ప్రారంభించారు.అలాగే నిర్మాతలుగా కూడా కొన్ని సినిమాలను నిర్మించారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ దంపతులు భారీ స్థాయిలోనే ఆస్తులు కూడా సంపాదించారని తెలుస్తుంది.తాజా నివేదికల ప్రకారం నటి దీపికా పదుకొనే( Deepika Padukone ) సినిమాలలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 497 కోట్ల విలువ చేసే ఆస్తిపాస్తులను సంపాదించారని తెలుస్తుంది.

Telugu Bollywood, Deepika, Ranaveer Singh, Ranveer Singh-Movie

ఇక రణవీర్ సింగ్ కూడా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన ఒక్కో సినిమాకు 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.ఇక ఈయన కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ 360 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తుంది.

రణవీర్ ఆస్తులతో పోలిస్తే దీపిక భారీ స్థాయిలోనే సంపాదించారని తెలుస్తుంది.ఇలా వీరిద్దరి ఆస్తుల విలువ( Ranveer Deepika Net worth ) కలిపితే సుమారు 860 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తుంది.

వీరిద్దరూ కూడా కరణ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ ( Koffee With Karan ) టాక్ షోలో పాల్గొని వీరి ప్రేమ పెళ్లి కెరియర్ సంపాదన గురించి పలు విషయాలను వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube