Petrol, Diesel : పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే పర్యావరణ కాలుష్యం ఎక్కువని మీకు తెలుసా..?

పెట్రోల్, డీజిల్( Petrol, Diesel ) వాహనాల వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, ఎలక్ట్రిక్ వాహనాలు( Electric vehicles ) పర్యావరణానికి సురక్షితమైనవని మనమంతా నమ్ముతున్నాం.అయితే ఓ సంస్థ ఈ విషయంపై కాస్త లోతుగా పరిశోధనలు చేసి షాకింగ్ నివేదిక తెలిపింది.

 Do You Know That Electric Vehicles Cause More Environmental Pollution Than Petr-TeluguStop.com

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఎమిషన్ అనలిటిక్స్ అనే సంస్థ ఉద్గారాల డేటాను విశ్లేషిస్తుందని తెలిసిందే.

ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి సురక్షితమైనవేనా.కాదా అని తెలుసుకోవడం కోసం పలు రకాల పరిశోధనలు చేసింది.

Telugu Diesel, Diesel Vehicles, Petrol-Technology Telugu

పరిశోధనల అనంతరం డీజిల్, పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే పర్యావరణ కాలుష్యం ఎక్కువ అని తేలింది.ఎలక్ట్రిక్ వాహనాల బ్రేక్లు, టైర్లు 1850 రెట్లు ఎక్కువగా కాలుష్యాన్ని వ్యాపింప చేస్తాయని ఆ సంస్థ పరిశోధన నివేదిక పేర్కొంది.ఎమిషన్ అనలిటిక్స్ సంస్థ( Emission Analytics Institute ) నివేదిక ప్రకారం.డీజిల్, పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల బరువు కాస్త ఎక్కువ.అధిక బరువు కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల టైర్లు త్వరగా అరిగిపోతాయి.దీంతో ఆ టైర్లలో ఉండే హానికరమైన రసాయనాలు గాలిలో వ్యాపిస్తాయి.

వాహనాలకు వాడే టైర్లు ముడి చమురు నుండి పొందిన సింథటిక్ రబ్బర్ తో తయారుచేస్తారు.ఇవి కాలుష్యానికి కారణం.

Telugu Diesel, Diesel Vehicles, Petrol-Technology Telugu

ఇక పెట్రోల్, డీజిల్ వాహనాలలో ఉండే ఇంజిన్ కంటే ఎలక్ట్రిక్ వాహనాలలో ఉండే బ్యాటరీ బరువు చాలా ఎక్కువ.ఇక ఎలక్ట్రిక్ వాహనాలలో ఉండే బ్యాటరీ బరువు సుమారుగా ఆర టన్ను ఉంటుంది.కాబట్టి పెట్రోల్ తో నడిచే కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లు 400 రెట్లు ఎక్కువగా ఉధ్గారాలను విడుదల చేస్తాయి.ఇప్పటివరకు మనమంతా ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచుతాయని అనుకున్నాం.

కానీ ఈ అధ్యయనం ఎలక్ట్రిక్ వాహనాలపై దిగ్భ్రాంతిని కలిగించింది.ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, టైర్ల వల్ల గాలి విషపూరితం అవుతోంది.

ఈ అధ్యయనం పర్యావరణాన్ని సురక్షితంగా మార్చే దిశగా మనల్ని హెచ్చరిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube