సమంతా చేస్తున్న ఈ వ్యాపారాల గురించి మీకు తెలుసా?

సమంత సౌత్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్.ఇక్కడ వరుస సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది.

 Do You Know About Samantha Businesses ,samantha, Businesses , School, Tollywood-TeluguStop.com

సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు సైతం చేస్తుంది.అడపాదడపా ఆయా వస్త్ర దుకాణాలు, నగల దుకాణాల ప్రారంభోత్సవాలకు కూడా వెళ్తోంది.

మొత్తంగా డబ్బు బాగానే సంపాదిస్తుంది.అయతే వచ్చిన డబ్బును వ్యాపారాల్లోకి మళ్లిస్తోంది.

ఇప్పటికే తనకు ఏకమ్ లర్నింగ్ అనే స్కూల్ ఉంది.సాకీ అనే దుస్తుల లేబుల్ కూడా తనదే.

ఈ రెండు వ్యాపారాలు తనకు మంచి లాభాలను తెచ్చి పెడుతున్నాయి.వీటితో పాటు మరో వ్యాపారం మీద కూడా తను ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

అతి త్వరలో ఆ వ్యాపారాన్ని మొదలు పెట్టేలా ఏర్పాట్లు చేస్తోంది.ఇంతకీ ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Businesses, Gunashaker, Samantha, School, Shakuntalam, Tollywood, Web, Ya

ఈ అందాల తార ఇప్పుడు నగల వ్యాపారంలోకి అడుగు పెట్టబోతుందట.ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసు కుంటుందట.పనులు కూడా మొదలయ్యాయట.వీలైనంత త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అటు ఇప్పటికే ఓ ఈ-కామర్స్ సైట్ లో వ్యాపార భాగస్వామిగా కూడా కొనసాగుతోంది.సస్టెయిన్ కార్ట్ అనే స్టార్టప్ కంపెనీలో సమంత పెట్టుబడులు పెట్టింది.

Telugu Businesses, Gunashaker, Samantha, School, Shakuntalam, Tollywood, Web, Ya

అంతేకాదు.ఈ కంపెనీ తనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండ బోతుంది.ఈ కంపెనీలో కేవలం ఎకో ఫ్రెండ్లీ వస్తువులను మాత్రమే అమ్ముతారు.దుస్తులు, ఇంటీరియర్ డెకరేషన్, హెల్త్ ప్రాజెక్టులతో పాటు అనేక సౌందర్య ఉత్పత్తుల ఈ వెబ్ సైట్ ద్వారా లభిస్తాయి.

అటు సమంతా వ్యాపారాలు చేస్తూనే వరుస సినిమాలకు ఓకే చెప్తుంది.ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటుంది.ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 2 డైరెక్టర్స్ తో మరో సిరీస్ చేయబోతుంది.

యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తంగా బాలీవుడ్ లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతోంది.

ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో తను శాకుంతలం అనే సినిమా చేస్తుంది.సమంతా కెరీర్ లో ఇదే తొలి పౌరాణిక సినిమా.

అటు కాతువకుల రెండు కాదల్ అనే సినిమాలోనూ తను యాక్ట్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube