డీజే టిల్లును డైరెక్ట్ చేయబోతున్న బొమ్మరిల్లు భాస్కర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సందడి చేస్తున్నటువంటి సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) అనంతరం హీరోగా మారిపోయారు.జోష్ ,ఆరెంజ్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సిద్దు గుంటూరు టాకీస్ సినిమా ద్వారా హీరోగా మారిపోయారు.

 Director Bommarillu Bhaskar To Direct Dj Tillu Siddu Jonnalagadda,siddu Jonnalag-TeluguStop.com

ఇలా ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో హీరోగా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు అయితే డీజే టిల్లు ( DJ Tillu )సినిమా మాత్రం ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈయనకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం సిద్దు టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ పనులతో పాటు ఇతర సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Telugu Bhaskar, Bommarillu, Dj Tillu, Orange-Movie

ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బొమ్మరిల్లు( Bommarillu ) సినిమా ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ భాస్కర్( Director Bhaskar ) ఆరెంజ్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు.అనంతరం ఈయన అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా పరవాలేదు అనిపించుకున్నారు అయితే త్వరలోనే బొమ్మరిల్లు భాస్కర్ సిద్దు జొన్నలగడ్డతో సినిమా చేయబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Bhaskar, Bommarillu, Dj Tillu, Orange-Movie

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరెంజ్ సినిమా( Orange )లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి సిద్దు జొన్నలగడ్డతో ఏకంగా ఓ సినిమా చేయబోతున్నారు అంటే ఇది నిజంగానే గ్రేట్ అని చెప్పాలి.అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా దాదాపు కరారు అయిందని,ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా ఆగస్టు 10వ తేదీ ఘనంగా జరుపబోతున్నారని తెలుస్తోంది.ఇక ఇదే రోజున ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను కూడా అధికారకంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube