ప్రతి సినిమాను డిఫ్రెంట్ డిఫరెంట్ గా తీస్తూ … సాధారణ సినిమాలకంటే కాస్త భిన్నంగా .ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా సినిమా తీయగల సమర్థుడు దర్శకుడు రవిబాబు.
ఆయన గత రెండేళ్లుగా ‘అదుగో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్ర కథ పందిపిల్ల చుట్టూ తిరుగుతూ ఉండబోతుందని, అందుకే రవిబాబు పంది పిల్లలను స్వయంగా పెంచుకుంటున్న విషయం తెల్సిందే.
పంది పిల్ల చుట్టూ తిరిగే ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని రవి బాబు ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే చాలాసార్లు విడుదలకు ప్రయత్నించిన ఈ చిత్రానికి మంచి ముహుర్తం దొరకలేదు.దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసి హడావుడి మొదలెట్టి ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు.తాజాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 7న విడుదల చేయనున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించారు.