సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంట సమంత మరియు నాగచైతన్య.‘ఏం మాయ చేసావే‘ సినిమాతో ప్రారంభమైన వీళ్లిద్దరి ప్రయాణం, పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది.నాలుగేళ్ల వరకు ఎలాంటి సమస్య లేకుండా దాంపత్య జీవితాన్ని ఎంతో సంతోషంగా కొనసాగించిన వీళ్ళిద్దరూ , ఎందుకో కొన్ని అనుకోని సంఘటనలు ఏర్పడడం వల్ల విడిపోవాల్సి వచ్చింది.వీళ్లిద్దరు విడిపోయిన విషయం వాళ్ళకంటే కూడా ఎక్కువగా అభిమానులు బాధపడుతున్నారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇద్దరూ ఎవరి కెరీర్ ని వారు చూసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయారు.కానీ వీళ్ళ అభిమానులు మాత్రం సోషల్ మీడియా లో రోజుకి ఒక్కసారైనా వీళ్లకు సంబంధించిన పాత జ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ ఉంటారు.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా వీళ్లిద్దరికీ సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అదేమిటంటే నిన్న నాగ చైతన్య ( Naga Chaitanya )పుట్టినరోజు జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు నాగ చైతన్య కి శుభాకాంక్షలు తెలియచేసారు.అంతే కాకుండా ఆయన లేటెస్ట్ చిత్రం ‘తండేల్‘ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసారు.
ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య కి సమంత ప్రత్యేకంగా ఒక బహుమతిని పంపి శుభాకాంక్షలు తెలియచేసినట్టు సోషల్ మీడియా( Social media ) లో ఒక వార్త ప్రచారం అవుతుంది.పెళ్ళైన కొత్తలో నాగ చైతన్య సమంత కోసం ప్రత్యేకంగా ఒక బ్రేస్ లెట్ చేయించి ఇచ్చాడట.
విడిపోయిన తర్వాత ఇద్దరికీ సంబంధించిన ఆస్తులు, వస్తువులు అన్నీ వెనక్కి ఇచ్చేసుకున్నారు కానీ, సమంత తన వద్ద ఉన్న చైతన్య బ్రేస్ లెట్ ని మాత్రం వెనక్కి ఇవ్వలేదట.ఇన్ని రోజులు తన వద్దనే ఉంచుకున్న సమంత, ఇక నాగ చైతన్య కి వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుందట.

అందుకే ఆయన పుట్టినరోజు సందర్భం వచ్చింది కాబట్టి, ఆ బ్రాస్లెట్ ని ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి నాగ చైతన్య ఇంటికి కొరియార్ చేయించినట్టుగా తెలుస్తుంది.ఈ బహుమతిని చూసి సమంత గిఫ్ట్ పంపింది అని ఆనందపడాలో, లేకపోతే తనకి సంబంధించిన ఏకైక గుర్తు ని వెనక్కి పంపినందుకు ఫీల్ అవ్వాలో నాగ చైతన్య కి అర్థం కాలేదట.సమంత ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు అంటూ మరోవైపు నాగ చైతన్య అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.