టీడీపీ అధినేత చంద్రబాబుతో యార్లగడ్డ వెంకట్రావు సమావేశం అయ్యారు.భేటీ అనంతరం యార్లగడ్డ మాట్లాడుతూ తన పరిస్థితులన్నీ చంద్రబాబుకు తెలియజేసినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో తన అవసరం ఉందని అనుకుంటే టీడీపీలో చేరతానన్నారు.
పార్టీ అధిష్టానం తనను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని యార్లగడ్డ తెలిపారు.
గుడివాడలో పోటీ చేయమన్నా పోటీకి దిగుతానని స్పష్టం చేశారు.పదవుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు.
చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్న యార్లగడ్డ ఎంత మంచి చేసినా వైసీపీ తనను గుర్తించలేదని ఆరోపించారు.వైసీపీ నేతల్లో తనకు సజ్జల అంటే గౌరవం అని పేర్కొన్నారు.
అదేవిధంగా తానేప్పుడూ చంద్రబాబును విమర్శించలేదని స్పష్టం చేశారు.