తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంక, కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి సరిహద్దుల్లో తూర్పు డెల్టా ప్రధాన కాలంలో మత్స్యకారులు సోమవారం చేపల వేటాడుతుండగా వారి వలకు ఈ డెవిల్ చేప చిక్కింది.భారతదేశంలో మత్స్య సంపదకు (ఆక్వా రంగానికి) నష్టాన్ని కలిగించే అతి భయంకరమైన, ప్రమాదకరమైన తక్కర్ (దెయ్యం, డెవిల్)చేప మొదట బంగ్లాదేశ్ నుండి అక్వేరియంలో పెంచుకునే ఆర్నమెంట్ ఫిష్ గా భారతదేశానికి వచ్చి మత్స్యకార రైతులకు నష్టాన్ని కలిగిస్తూ సవాల్ విసురుతుంది.
అయితే మత్స్యకారులకు వింతగాను, భయంకరంగా కనిపించడంతో వారు స్థానిక విలేకర్ల సాయంతో జిల్లా ఫిషరీస్ జెడి వి కృష్ణారావు దృష్టికి తీసుకు వెళ్ళడంతో స్పందించిన ఆయన చేప యొక్క వివరాలు వెల్లడించారు.ఈ చేప మన రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువులలో ప్రవేశించి ప్రమాదకర స్థాయిలో ఉందని మిగిలిన చేపలపై దాడిచేసి వాటిని తనకు ఆహారంగా తీసుకుని రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని వెల్లడించారు.
ఇది విత్తన చేపలు ద్వారా రాష్ట్రం నలుమూలలకు విస్తరించిందని, ఆక్వా రంగానికి పెద్ద సమస్యగా తయారయింది, ఈ చేపను దొరికినచోటే అంతం చేయాలని అన్నారు.కాగా వింతగా, భయంకరంగా కనిపించే ఈ చేపను చూసేందుకు 16వనెంబరు జాతీయ రహదారిపై వెళ్లే పలువురు ఆసక్తిగా తిలకించారు