తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఇప్పటికే 10 వారాలు ముగిసాయి.ఈ షో చూస్తుండగానే ముగింపు దశకు చేరుకుంది.
ఇక మరొక రెండు వారాల్లో ఈ షో విన్నర్ ఎవరో తెలియనుంది.ఇకపోతే తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి అషు రెడ్డి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.
బాబా భాస్కర్ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను అరియానా, అషు లలో ఇద్దరిలో ఎవరికి వాడను అని నిశ్చయించుకోవడంతో అషు రెడ్డి ఎలిమినేట్ అయిన బయటకు వచ్చేసింది.నవ్వుతూ స్టేజి పైకి వచ్చింది అషు రెడ్డి.
తాను ఎలిమినేట్ అయినందుకు ఎలాంటి బాధ లేదని తాను ఎంతో సంతోషంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాను అని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునతో చెప్పుకొచ్చింది అషు రెడ్డి.కాకపోతే మరొక వారం నుంచి ఉంటే టాప్స్ 6 లోకి వచ్చే దాన్ని అని తెలిపింది.
అనంతరం బిగ్ బాస్ అషు రెడ్డి జర్నీ వీడియో రూపంలో చూపించారు.ఈ క్రమంలోనే మొదట అషు రెడ్డి చేసిన కొంచెం పని ఉంది చూపించారు.అందులో అషు పోస్ట్ నాగార్జునకు బుగ్గ మీద ముద్దు పెట్టింది.అందుకు సంబంధించిన సీన్ ను అషు రెడ్డి జర్నీ వీడియోలో చూపించారు.
ఆ వీడియో చూసిన తర్వాత అషు రెడ్డి మళ్ళీ నాగార్జునకి బుగ్గపై ముద్దు పెట్టేసింది.అలా బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఇప్పుడు వెళ్ళిపోతూ చివర్లో కూడా నాగార్జున కు బుగ్గ పై ముద్దు పెట్టింది అషు.అనంతరం బిగ్ బాస్ స్టేజీపైన అషు రెడ్డి కి ఒక టాస్క్ ఇచ్చాడు నాగార్జున.హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ను ఒక్కొక్కరిని ఒక్కొక్క వెజిటేబుల్, ఫ్రూప్ట్స్ తో పోల్చమని చెప్పి టాస్క్ ఇచ్చాడు.
అప్పుడు అషు అన్ని చేదు అనుభవాలే అన్న ఉద్దేశంతో శివ కాకరకాయ, ఆ తర్వాత పైకి ఏ విధంగా ఉన్నా లోపలికి మాత్రం మంచోడు,చిన్న పిల్లాడు అని చెప్పి నటరాజ్ కు కొబ్బరికాయ ఇచ్చింది.