ప్రకాశం జిల్లా దోర్నాలలో నల్లవాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ధ్వంసమైంది.జిలెటిన్ స్టిక్స్ అమర్చి చెక్ డ్యామ్ ను ఓ రైతు పేల్చివేశాడు.కాగా నల్లవాగుపై రూ.9.50 లక్షలతో చెక్ డ్యామ్ ను నిర్మించారు.ఈ నేపథ్యంలో ధ్వంసమైన చెక్ డ్యామ్ ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు.
నిందితుడు స్థానిక రైతు మల్లికార్జునగా గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.