కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్.. ఇలా చేస్తే రూ.లక్ష మీదే!

టూరిజం ఒక దేశ ఆర్థికాభివృద్ధికి ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇండియాలో పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.

 Design A Logo For Yuva Tourism Club And Win One Lakh Rupees Details, Youth Touri-TeluguStop.com

వీటిలో పర్యటించడం ద్వారా దేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది.జనాలు ఈ పర్యాటక ప్రాంతాలకు ఎక్కువగా రావాలంటే వాటి గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది.

దానిని యువతకు అప్పజెప్పింది భారతదేశ ప్రభుత్వం.కేంద్ర ప్రభుత్వం యూత్ టూరిజం లక్ష్యంగా ఇండియా@75 పేరుతో ఒక ప్రోగ్రామ్‌ తీసుకొచ్చింది.

దీనిలో భాగంగా యంగ్ టూరిజం క్లబ్స్ కండక్ట్ చేస్తోంది.

యువ టూరిజం క్లబ్ కోసం మంచి లోగోను డిజైన్ చేసి ఇవ్వాలని కూడా కోరుతోంది.

ఈ పోటీలో యువకులు పాల్గొని మంచి డిజైన్ కేంద్రానికి అందించవచ్చు.విజేతగా నిలిచిన వారికి రూ.లక్ష అందిస్తామని కేంద్రం ఇప్పటికే బంపర్ ఆఫర్ ఇచ్చింది.ఆసక్తి గల అభ్యర్థులు అప్లికేషన్‌ను 2023, మార్చి 1 లోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Telugu Central, Design Logo, Logo Design, Rs, Win Rupees, Tourism Club, Yuva Tou

ఆన్‌లైన్‌లోనే ప్రభుత్వం సబ్మిట్ చేయొచ్చు.మైగౌవ్ (MyGov) వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత అప్లికేషన్ సబ్‌మిట్ చేయవచ్చు.ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే వారు తమ పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్, పోస్టల్ అడ్రస్ వంటి ముఖ్య వివరాలు అందజేయాల్సి ఉంటుంది.

Telugu Central, Design Logo, Logo Design, Rs, Win Rupees, Tourism Club, Yuva Tou

జేపీజీ, జేపీఈజీ, పీఎన్‌జీ, ఎస్‌వీజీ ఫార్మాట్లలోనే ఉన్న లోగో డిజైన్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది.లోగోను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే డిజైన్ చేయాల్సి ఉంటుంది.కలర్‌లోనే లోగో డిజైన్ ఉండాలి.

మరిన్ని వివరాలను మై గవర్నమెంట్ వెబ్‌సైట్‌ పేజీలో చూసుకోవచ్చు.ఇకపోతే లోగోను వెబ్‌సైట్‌లో ఉపయోగించేలా డిజైన్ చేయడం చాలా ముఖ్యం.

లోగో కనీసం 300 డీపీఐ రెజల్యూషన్‌తో ఉండాలని కేంద్రం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube