కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్.. ఇలా చేస్తే రూ.లక్ష మీదే!

టూరిజం ఒక దేశ ఆర్థికాభివృద్ధికి ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇండియాలో పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.

వీటిలో పర్యటించడం ద్వారా దేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది.జనాలు ఈ పర్యాటక ప్రాంతాలకు ఎక్కువగా రావాలంటే వాటి గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది.

దానిని యువతకు అప్పజెప్పింది భారతదేశ ప్రభుత్వం.కేంద్ర ప్రభుత్వం యూత్ టూరిజం లక్ష్యంగా ఇండియా@75 పేరుతో ఒక ప్రోగ్రామ్‌ తీసుకొచ్చింది.

దీనిలో భాగంగా యంగ్ టూరిజం క్లబ్స్ కండక్ట్ చేస్తోంది.ఈ యువ టూరిజం క్లబ్ కోసం మంచి లోగోను డిజైన్ చేసి ఇవ్వాలని కూడా కోరుతోంది.

ఈ పోటీలో యువకులు పాల్గొని మంచి డిజైన్ కేంద్రానికి అందించవచ్చు.విజేతగా నిలిచిన వారికి రూ.

లక్ష అందిస్తామని కేంద్రం ఇప్పటికే బంపర్ ఆఫర్ ఇచ్చింది.ఆసక్తి గల అభ్యర్థులు అప్లికేషన్‌ను 2023, మార్చి 1 లోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

"""/" / ఆన్‌లైన్‌లోనే ప్రభుత్వం సబ్మిట్ చేయొచ్చు.మైగౌవ్ (MyGov) వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత అప్లికేషన్ సబ్‌మిట్ చేయవచ్చు.

ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే వారు తమ పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్, పోస్టల్ అడ్రస్ వంటి ముఖ్య వివరాలు అందజేయాల్సి ఉంటుంది.

"""/" / జేపీజీ, జేపీఈజీ, పీఎన్‌జీ, ఎస్‌వీజీ ఫార్మాట్లలోనే ఉన్న లోగో డిజైన్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది.

లోగోను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే డిజైన్ చేయాల్సి ఉంటుంది.కలర్‌లోనే లోగో డిజైన్ ఉండాలి.

మరిన్ని వివరాలను మై గవర్నమెంట్ వెబ్‌సైట్‌ పేజీలో చూసుకోవచ్చు.ఇకపోతే లోగోను వెబ్‌సైట్‌లో ఉపయోగించేలా డిజైన్ చేయడం చాలా ముఖ్యం.

లోగో కనీసం 300 డీపీఐ రెజల్యూషన్‌తో ఉండాలని కేంద్రం తెలిపింది.

ట్రంప్‌కు ఫస్ట్ షాక్ .. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను నిలిపివేసిన కోర్ట్, భారతీయులకు ఊరట